TS Govt Jobs 2022: తెలంగాణలో మరో 10105 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు

TS Govt Jobs 2022: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తోంది. ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటోంది. దీంతో ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఇప్పటికే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం కూడా టెట్ నిర్వహించింది. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో ఖాళీల భర్తీ కోసం కసరత్తు ప్రారంభించింది. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ […]

Written By: Srinivas, Updated On : June 18, 2022 9:51 am
Follow us on

TS Govt Jobs 2022: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తోంది. ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటోంది. దీంతో ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఇప్పటికే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం కూడా టెట్ నిర్వహించింది. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో ఖాళీల భర్తీ కోసం కసరత్తు ప్రారంభించింది. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఎలాగైనా ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలని తాపత్రయపడుతున్నారు.

KCR

రాష్ట్రంలో కొత్తగా 10,105 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో నిరుద్యోగులకు ఊరట లభించనుంది. ఉద్యోగాల సాధన కోసం వారికి ఆశలు పెరుగుతున్నాయి. ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తమ భవితవ్యం మార్చుకోవాలని చూస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగాల సాధనకు నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అవుతున్నారు.

Also Read: Unemployed in AP: జాబు లేదు..కేలండర్ లేదు.. ఉద్యోగాల భర్తీని మరిచిన ఏపీ సర్కారు

పాఠశాలలు, గురుకులాల్లో 9096 పోస్టులు ఖాళీలున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టుల కోసం కోచింగులకు వెళ్తున్నారు. జాబ్ సంపాదించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇన్నేళ్ల నిరీక్షణకు ఇప్పుడు ఉద్యోగాలు రానుండటంతో అభ్యర్థులు తమ ప్రతిభకు పదును పెడుతున్నారు. పోటీ పరీక్షల కోసం అన్ని పుస్తకాలు తిరగేస్తున్నారు. ఉద్యోగం సంపాదించి జీవితానికి ఓ గ్యారంటీ తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

TS Govt Jobs 2022

రాష్ట్రం మొత్తంలో 45,135 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వివిధ శాఖల నుంచి వచ్చిన సమాచారం మేరకు పోస్టుల ఖాళీలకు నోటిఫికేషన్లు వెలువరించింది. దీంతో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు పంట పండినంత సంతోషం కలుగుతోంది. జాబ్ కొట్టే క్రమంలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. చివరకు ప్రభుత్వ ఉద్యోగమే తమ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇన్నాళ్లకు తమ కల నెరవేరబోతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:AP Liquor Policy: ఏపీ ప్రజలంటే అంత అలుసా జగన్ సార్?

Tags