Homeజాతీయ వార్తలుParliament Winter session : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తొలి రోజే రచ్చ.. విపక్షాల ఆందోళన

Parliament Winter session : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తొలి రోజే రచ్చ.. విపక్షాల ఆందోళన

Parliament Winter session  పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే లోక్‌సభలో అధాని లంచం వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. అదానీ అంశంపై చర్చ జరపాలని ఉభయ సభలో విపక్షాలు పట్టుపట్టాయి. సమావేశాలు ముందుకు సాగనివ్వలేదు. సభ ముందుకు సాగే అవకాశాలు లేకపోవండంతో స్పీకర్‌ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్య సభ కూడా వాయిదా పడింది. సమావేశాలు వాయిదా పడిన తర్వాత పార్లమెంట్‌ బయట ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. పిడికెడు మంది ప్రతిపక్షాలు పార్లమెంటులో చర్చ చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారన్నారు. అయినా సభలను సజావుగా సాగకుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు.

పలు బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం.
ఇదిలా ఉంటే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం తర్వాత ప్రారంభమైన సమావేశాలకు ఎన్డీఏ పక్ష పార్టీలు ఉత్సాహంగా వచ్చాయి. ఇక ఈ సెషన్స్‌లో వక్ఫ్‌ సవరణ బిల్లు పెట్టే అవకాశం ఉంది. మరో 16 బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాని కేంద్రం భావిస్తోంది. ఈ సమావేశాల్లో రాజ్యసభ 2024–25 సంవత్సరానికి గ్రాంట్ల కోసం మొదటి బ్యాచ్‌ అనుబంధ డిమాండ్లపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ కోర్టుల యొక్క ధనవంతులైన (ఒక కేసు యొక్క ద్రవ్య విలువగా నిర్వచించబడింది) అప్పీలేట్‌ అధికార పరిధిని ప్రస్తుతమున్న రూ .3 లక్షల నుండి రూ .20 లక్షల వరకు పెంచడానికి పంజాబ్‌ కోర్టులు (సవరణ) బిల్లు, షిప్పింగ్‌ బిల్లు, ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు ఈ సమావేశాల్లో అమోదించే అవకాశం ఉంది.

డిసెంబర్‌ 20 వరకు సమావేశాలు..
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 20 వరకు జరిగే అవకాశం ఉంది. మణిపూర్‌ హింస, గౌతం అదాని అవినీతి చర్యలపై యూఎస్‌ అరెస్టు వారెంట్, ఢిల్లీలో వాయుకాలుష్యం, తదితర అంశాలు ఈ సమావేశాల్లో మోదీ సర్కార్‌ను నిలదేసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular