Homeఅంతర్జాతీయంOperation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ షాక్‌లు.. పాక్‌లో ఉగ్రవాద కేంద్రం నేలమట్టం!

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ షాక్‌లు.. పాక్‌లో ఉగ్రవాద కేంద్రం నేలమట్టం!

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఇందులో మే 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు దాడుల చేసింది. పాకిస్తాన్‌ దాడులను తిప్పి కొట్టింది. మే 7, 8వ తేదీల్లో భారత వైమానికదళం జరిపిన దాడుల్లో పాకిస్తాన్‌లోని 9 ఉగ్రస్థావరాలు ధ్వంసమయ్యాయి. వంద మంది ఉగ్రవాదులు చనిపోయారు. కానీ, పాకిస్తాన్‌ తమకు ఏమీ కాలేదని బుకాయించింది. తాజాగా 600 మంది సైనికులు మరణించిన వీడియో బయటకు వచ్చింది. వారికి నివాళులు అర్పించారు అధికారులు. ఇక పాకిస్తాన్‌లోని లష్కర్‌ ఎ తోయిబా ఉగ్రవాద సంస్థ హెడ్‌ క్వార్టర్‌ కూడా ఆపరేషన్‌ సిందూర్‌లో ధ్వంసమైంది. దీనిని తాజాగా ఆ సంస్థ కీలక నాయకులే అంగీకరించారు.

శిక్షణ శిబిరం ముగింపులో..
పీవోకేకు దగ్గరగా ఉన్న ఈ ప్రదేశం లష్కర్‌–ఎ–తౌయిబా ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉంది. మార్కజ్‌–ఎ–తౌయిబా మసీదు అని పాక్‌ చెప్పినా, ఇది ఉగ్రవాద శిక్షణ కేంద్రం. ఆపరేషన్‌ సిందూర్‌లో ఈ స్థావరం పూర్తిగా ధ్వంసమై, నెలలు కార్యకలాపాలు ఆగాయి. ఇప్పుడు సమీపంలో మొదటి శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో లష్కర్‌ ఎ తోయిబా ఆపరేషనల్‌ కమాండర్‌ హీఫిజ్‌ అబ్దుల్‌ రవూఫ్‌ ప్రధాన వక్తగా మాట్లాడాడు. పీవోకేలో లాంచ్‌ ప్యాడ్‌లు నడుపుతూ భారత్‌లోకి ఉగ్రవాదులను పంపే ఈయన్ని అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. పాక్‌లో బహిరంగంగా సంచరించే రవూఫ్, మార్కజ్‌–ఎ–తౌయిబా హెడ్‌ క్వార్టర్‌ ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ కొట్టిన దెబ్బకు పూర్తిగా ధ్వంసమైందని మొదటిసారి ఒప్పుకున్నాడు. ఆపరేషన్‌ సిందూర్‌లో చనిపోయిన ఉగ్రవాదులకు అంతిమ నమాజ్‌ చేసిన రవూఫ్, ప్రసంగంలో భావోద్వేగంతో ఏడుస్తూ కనిపించాడు. చీఫ్‌ హాఫిజ్‌ సయ్యిద్‌ కుమారుడు తలహా సయ్యిద్, సైఫుల్లా కసూరి సహా లష్కర్‌ టాప్‌ నాయకులు హాజరయ్యారు.

పాక్‌ ప్రభుత్వం, చైనా సపోర్ట్‌తోనే..
పాక్‌ ప్రభుత్వం సహకారం లేకుండా ఇలాంటి కార్యకలాపాలు అసాధ్యమని రవూఫ్‌ స్పష్టం చేశాడు. చైనా కూడా పూర్తి సహాయం అందిస్తోందని వెల్లడించాడు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో చైనా భారత సాంకేతిక సమాచారాన్ని పాక్‌కు అందించి సహకరించిందని చెప్పాడు. భారత రియల్‌టైమ్‌ ఇంటెలిజెన్స్‌ సామర్థ్యం చూసి ఆశ్చర్యపోయామని ఒప్పుకున్నాడు.

పాక్‌ బండారం బట్టబయలు..
పాక్‌ మొదట లష్కర్‌ ఎ తోయిబా హెడ్‌ క్వార్టర్‌ను మసీదుగా చూపించింది. కానీ పాకిస్తాన్‌కు ఆపరేషన్‌ సిందూర్‌లో గట్టి దెబ్బ తగిలింది. లష్కర్‌ ఎ తోయిబా కేంద్ర కార్యాలయం నెలల పాటు మూతపడింది. మర్కజ్‌ ఎ తోయిబాను మసీదుగా పాకిస్తాన్‌ చెప్పింది. కానీ ఇది ఉగ్రవాద కేంద్రం అని రవూఫ్‌ తాజాగా వెల్లడించారు. పాకిస్తాన్‌ బండారం బట్టబయలు అయింది. ఇంతకాలం మన సైనికులను విమర్శించేవారు ఇప్పుడు లష్కర్‌ ఎ తోయిబాకు ఏం జరిగిందో తెలుసుకోవాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular