Operation Sindoor: బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన భారత త్రివిధ దళాలు.. ఖచ్చితమైన లక్ష్యంతో ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేశాయి. ఒక రకంగా పాకిస్తాన్ దేశానికి క్రొకోడల్ ఫెస్టివల్ చూపించాయి. మిస్సైళ్ల వర్షం కురిపించి.. తమ సత్తా ఏమిటో చూపించాయి. భారత్ చేసిన దాడుల వల్ల ఏకంగా 70 మంది ఉగ్రవాదులు మరణించారు. ఇటీవల జరిగిన పహల్గాం ఘటన తర్వాత సరిహద్దు వద్ద భారత్ తనిఖీలను ముమ్మరం చేసింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఉగ్రవాదులు తమ స్థావరాలను అక్కడ నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోకి మార్చారు. ఇంకా కొన్ని ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ వెళ్లిపోయాయి. ఈ దశలో భారత్ ఇంటలిజెన్స్ నివేదికతో ఉగ్రవాదులు స్థావరాలు ఏర్పరచుకున్న ప్రాంతాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు జరిపింది. ఇటీవల కాలంలో ఒక దేశ ఆర్మీ ఈ స్థాయిలో అత్యంత నిర్దిష్టమైన ప్రణాళికతో దాడులు జరపడం ఇదే తొలిసారి.
Also Read: ఆపరేషన్ సిందూర్: భారత్‌కు గర్వకారణం, పాక్‌కు షాక్
పరిస్థితి ఎలా ఉందంటే..
పాకిస్తాన్లో 9 ఉగ్రవాద స్థావరాలపై భారత త్రివిధ దళాలు దాడులు జరిపాయి. ఉత్తర పాకిస్తాన్, దక్షిణ పాకిస్తాన్ అని తేడా లేకుండా బాంబుల వర్షం కురిపించాయి. బాహవల్పూర్, కోట్లీ, మురిద్గే, గుల్పూర్, సవాయి, సర్జల్, బర్నాలా, మెహమూనా, సియాల్ కోట్, ముజపరాబాద్ ప్రాంతాలలో భారత సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో లష్కరే ఏ తోయిబా, జై షై మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన కార్యాలయాలు నేలమట్టమయ్యాయి. దాదాపు 70 మంది ఉగ్రవాదులు కన్నుమూశారు. అయితే పాకిస్తాన్ దేశంలో ఈ స్థాయిలో ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయని భారత చేసిన దాడుల ద్వారా బయటి ప్రపంచానికి తెలిసింది. వాస్తవానికి పాకిస్తాన్ పేరు చెప్తే పేద దేశం గుర్తుకు వస్తుంది. ఈ ఉగ్రవాద సంస్థల కార్యాలయాలు అత్యంత విలాసవంతంగా ఉన్నాయి. పూర్తిగా ఇస్లాం మతశైలిలో ఆ భవనాలు నిర్మించారు. అందులో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. భారత్ చేసిన దాడుల వల్ల ఇవన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. అయితే చనిపోయిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారు అనే విషయంపై ఇంతవరకు స్పష్టత రాలేదు. మరోవైపు భారత్ చేసిన దాడులను పాకిస్తాన్ మరో కోణంలో ప్రసారం చేస్తోంది. భారత చేసిన దాడుల వల్ల పాకిస్థాన్లో ప్రజలు చనిపోయారని కల్లబొల్లి కబుర్లు చెబుతోంది. అయితే దీనిని భారత సైన్యం తిప్పి కొడుతోంది. పాకిస్తాన్ అనవసరమైన రచ్చ చేస్తోందని.. తమ ఉద్దేశం పాకిస్తాన్ పౌరులు.. పాకిస్తాన్ దేశానికి చెందిన ఆస్తులు కాదని.. ఉగ్రవాదుల స్థావరాలు మాత్రమే టార్గెట్ అని భారత ఆర్మీ చెబుతోంది. తమ టార్గెట్ నూటికి నూరు శాతం క్లియర్ గా ఉందని.. ఏమాత్రం ఆ దేశానికి సంబంధించిన సిటిజన్స్ పై తాము దాడులు చేయలేదని భారత ఆర్మీ స్పష్టత ఇచ్చింది.
Also Read: ఉగ్రవాదానికి భారత్ సమాధానం.. ఒక చిత్ర కథ