Operation Sindoor: జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో గత నెల 22న పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా మన దేశానికి చెందిన త్రివిధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలు టార్గెట్ గా మెరుపు దాడులు చేపట్టాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ మెరుపు దాడులలో దాదాపు 80 మంది ఉగ్రవాదులు మరణించినట్టు సమాచారం. 9 ఉగ్రవాద స్థావరాలపై భారత త్రివిధ దళాలు దాడులు చేశాయి. 1971లో మన దేశానికి చెందిన త్రివిధ దళాలు సంయుక్తంగా దాడులు చేపట్టాయి. ఆ తర్వాత ఇప్పుడే ఈ స్థాయిలో దాడులు నిర్వహించడం విశేషం. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ – పాకిస్తాన్ దేశాలలోని సరిహద్దు ప్రాంతాలలో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులాగా మారాయి.. ఇవి ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ పోటీలపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ లు నిర్వహిస్తామని.. ఎట్టి పరిస్థితుల్లో అవి వాయిదా పడవని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. అయితే పాకిస్తాన్ సరిహద్దులో ఉండే ధర్మశాల మైదానంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతాయా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. అంతేకాదు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే 18 విమానాశ్రయాలను ఇండియన్ గవర్నమెంట్ టెంపరరీగా క్లోజ్ చేసింది. ఇందులో ధర్మశాల, జమ్మూ, శ్రీనగర్, చండీగఢ్, అమృత్ సర్ విమానాశ్రయాలు ఉన్నాయి. ధర్మశాల విమానాశ్రయం మూసివేయడంతో ఇక్కడ ముంబై, పంజాబ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. పంజాబ్ జట్టుకు ధర్మశాల మైదానం రెండవ సొంత సొంత మైదానంగా ఉంది. ఇప్పటికే ఇక్కడ ఒక మ్యాచ్ నిర్వహించారు. ఇంకా రెండు మ్యాచులు జరగాలి. ఈనెల 8న ఢిల్లీ, పంజాబ్ ఈ మైదానంలో తలపడతాయి. మే 11న పంజాబ్, ముంబై పోటీ పడతాయి..
Also Read: ఆపరేషన్ సిందూర్.. కల్నల్ సోఫియా ఖురేషి పాత్ర ఏంటి?
నిర్వహణ సాధ్యమవుతుందా?
విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేసిన నేపథ్యంలో ఆటగాళ్లు అక్కడికి ఎలా వెళ్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఒకవేళ ప్లేయర్లు బై రోడ్డు ద్వారా వెళ్ళినప్పటికీ.. బ్రాడ్కాస్టర్ సిబ్బంది, ఇతర పరికరాలను అక్కడే తరలించడం అంత సాధ్యం కాదు. ఇక గురువారం జరిగే మ్యాచ్ కోసం పంజాబ్, ఢిల్లీ ప్లేయర్లు ధర్మశాల వెళ్లిపోయారు. అయితే రేపటి మ్యాచ్ నిర్వహిస్తారా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. ధర్మశాల లో జరిగే రెండు మ్యాచ్లను వాయిదా వేస్తే.. ఎక్కడ నిర్వహిస్తారనేది చూడాల్సి ఉంది. మరో వైపు ఇక్కడ ఒకవేళ మ్యాచ్లు కనుక నిర్వహిస్తే టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. ఈ మ్యాచ్ కు సంబంధించి బిసిసిఐ అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాలి. ఇక ఈ రెండు మ్యాచ్లు ప్లే ఆఫ్ రేసు ను ఎఫెక్ట్ చేయగలవని ఐపిఎల్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఢిల్లీ, పంజాబ్, ముంబై జట్లకు ఈ వేదికపై జరిగే మ్యాచ్లో అత్యంత కీలకకం.
Also Read: సింధూర్ ప్రాముఖ్యత, దాని చరిత్ర మీకు తెలుసా?