https://oktelugu.com/

15 ఎమ్మెల్సీల్లో 12 వాళ్లకే.. జగన్ అనూహ్యం

వైఎస్ జగన్ సీఎం కాగానే మొత్తం రెడ్డి రాజ్యం చేస్తాడని విమర్శలు వచ్చాయి. కానీ అందుకు భిన్నంగా సీనియర్ రెడ్డి నేతలను సైతం పక్కనపెట్టి సామాజికన్యాయం పేరుతో దళితులు, బీసీలు, వివిధ సామాజికవర్గాలకు పెద్ద పీట వేశారు. ఈ క్రమంలోనే సీనియర్ నేతలైనా కూడా ఎమ్మెల్యేలు రోజా, ధర్మాన, భూమన, అంబటి రాంబాబు లాంటి వారిని జగన్ పక్కనపెట్టేశారు. ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనితీరు గమనించడం […]

Written By:
  • NARESH
  • , Updated On : June 16, 2021 12:17 pm
    Follow us on

    వైఎస్ జగన్ సీఎం కాగానే మొత్తం రెడ్డి రాజ్యం చేస్తాడని విమర్శలు వచ్చాయి. కానీ అందుకు భిన్నంగా సీనియర్ రెడ్డి నేతలను సైతం పక్కనపెట్టి సామాజికన్యాయం పేరుతో దళితులు, బీసీలు, వివిధ సామాజికవర్గాలకు పెద్ద పీట వేశారు. ఈ క్రమంలోనే సీనియర్ నేతలైనా కూడా ఎమ్మెల్యేలు రోజా, ధర్మాన, భూమన, అంబటి రాంబాబు లాంటి వారిని జగన్ పక్కనపెట్టేశారు. ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనితీరు గమనించడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఏపీలో సంక్షేమ ఎజెండాను కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలకు ఫలాలు అందిస్తున్నారు. పగవారికి కూడా పైసలు ఇస్తూ పేరు తెచ్చుకున్నారు. సంక్షేమ ఎజెండాను కొనసాగిస్తూనే జగన్ మోహన్ రెడ్డి సమాజంలోని నిర్లక్ష్యం చేయబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సోషల్ ఇంజనీరింగ్‌ను అనుసరిస్తున్నారు.

    స్వాతంత్య్రానంతరం తొలిసారిగా కుల ఆధారిత కార్పొరేషన్లను సృష్టించడం.. 50 కు పైగా కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడం జగన్ సాధించిన ఘనతకు నిదర్శనంగా చెప్పొచ్చు. జగన్ మోహన్ రెడ్డి పరిపాలనను చూడటానికి.. విశ్లేషించడానికి మరో అవకాశం దొరికింది. తాజాగా రాష్ట్రంలోని ఎమ్మెల్సీ సీట్లను భర్తీ చేయడానికి జగన్ ఇస్తున్న ప్రాతినిధ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.

    2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి జగన్ అణగారిన వర్గాలకే పదవుల్లో పెద్దపీట వేయడం విశేషం. ఇప్పివరకు 15 మందిని ఎమ్మెల్సీలుగా జగన్ ఎన్నుకున్నారు. ఈ 15 ఎమ్మెల్సీలలో 12 మంది ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలకు చెందినవారు, ముగ్గురు మాత్రమే ఒసిలు కావడం గమనార్హం.

    ఎస్సీ వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు: పి రవీంద్ర బాబు (ఎస్సీ), బల్లి కళ్యాణ చక్రవర్తి (ఎస్సీ), డోక్కా మాణిక్య వరప్రసాద్ (ఎస్సీ), కోయ మోషేన్ రాజు (ఎస్సీ)లను జగన్ ఎమ్మెల్సీలను చేశారు. ఇక బీసీల్లో చూస్తే మోపిదేవి వెంకట రమణ (బిసి), దువ్వాడ శ్రీనివాస్ (బిసి), పోతులా సునీత (బిసి), రమేష్ యాదవ్ (బిసి), సి రామచంద్రయ్య (బిసి)లను ఎమ్మెల్సీలుగా జగన్ నామినేట్ చేశారు. బిసిల నుండి ఐదుగురిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకున్నారు.

    మైనారిటీల్లో చూస్తే.. జాకియా ఖానుమ్ (మైనారిటీ), మహ్మద్ ఇక్బాల్ (మైనారిటీ), మహ్మద్ కరీమున్నిసా (మైనారిటీ) లకు మూడు ఎంఎల్‌సిలు ఇచ్చారు.

    జగన్ రెండేళ్ళ పాలనలో పోస్టులు పొందిన వారిలో అగ్రవర్ణాలకు చెందిన వారు ముగ్గురు మాత్రమే (ఓసీలు) ఉన్నారు. వారిలో చల్లా భగీరథారెడ్డి (ఓసీ), లేళ్ల అప్పిరెడ్డి (ఓసీ), తోటా త్రిమూర్తులు (ఓసీ). దీన్ని జగన్ తన సామాజికవర్గాన్ని, అగ్రవర్ణాలను పక్కనపెట్టి అణగారిన వర్గాలకే పెద్దపీట వేస్తున్నట్టు తెలుస్తోంది.