ఎటూ తేల్చుకోలేకపోతున్న విజయమ్మ?

పట్టమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంది పరిస్థితి. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు వైఎస్ సతీమణి విజయమ్మ పరిస్థితి కూడా అలాగే తయారైంది. భర్త మరణించిన తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. కానీ కొడుకు కోసం 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విశాఖ పట్నం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కుమారుడు పెట్టిన పార్టీకి మద్దతుగా ఎన్నికల సమయంలో ప్రచారం […]

Written By: Srinivas, Updated On : June 16, 2021 10:24 am
Follow us on

పట్టమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంది పరిస్థితి. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు వైఎస్ సతీమణి విజయమ్మ పరిస్థితి కూడా అలాగే తయారైంది. భర్త మరణించిన తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. కానీ కొడుకు కోసం 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విశాఖ పట్నం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కుమారుడు పెట్టిన పార్టీకి మద్దతుగా ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు.

ఇప్పుడో పెద్ద చిక్కొచ్చి పడింది విజయమ్మకు. కొడుకు, కూతురు మధ్య నలిగిపోతున్నారు. కొడుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి పరువు నిలబెట్టారు. కూతురు షర్మిల తెలంగాణలో తెలంగాణ వైఎస్సార్ టీపీ పేరుతో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టారు.దీనికి జగన్ కు ఇష్టం లేదు. కానీ కూతురు మాట కాదనలేక విజయమ్మ ఓకే అంది. కానీ కొడుకు మాత్రం ఇది కరెక్టు కాదని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలో వైఎస్సార్ టీపీకి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ. దీంతో ఆమె ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు. వైఎస్సార్ టీపీ ఏర్పాటుపై అభ్యంతరాలు లేవని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్తగా పార్టీ ఆవిర్బవించింది. దీనిపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ఉండగా అదే పార్టీని తెలంగాణలో పెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం విజయమ్మకు అసలు సమస్య ఎదురైంది. అటు కూతురు మాట కాదనలేక ఇటు కొడుకుకు ఎధురు చెప్పలేక సతమతమవుతున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టడంపై జగన్ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. వద్దదని వారిస్తూనే ఉన్నారు. కానీ షర్మిల వినడం లేదు. దీంతో విజయమ్మ ఇద్దరి మధ్య నలిగిపోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.