great writer : ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఒక సినిమా సక్సెస్ అయితే లైమ్ లైట్ లోకి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అదే ఒక సినిమా ఫ్లాప్ అయితే మాత్రం తమ సర్వస్వాన్ని కోల్పోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారనే చెప్పాలి. ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే మాత్రం అది చాలా కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి…
సినిమా ఇండస్ట్రీలో ఏరోజు ఎవరు ఏ పరిస్థితిలో ఉంటారు అనేది ఎవరు చెప్పలేరు. ఒకప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న చాలా మంది ఇప్పుడు అవకాశాలు లేక దీన స్థితిలో ఉన్న సంఘటనలు చాలా ఉన్నాయి. అలాగే ఒకప్పుడు అవకాశాలు లేని వారు ఇప్పుడు టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న వారు కూడా ఉన్నారు. ఇక ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా రాణించాలి అంటే అంత ఆశా మాశి విషయమైతే కాదు. ప్రతి విషయంలో చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది వస్తుంది. ఇక ఇదిలా ఉంటే పాటల రచయితగా మంచి గుర్తింపును సంపాదించుకున్న కులశేఖర్ లాంటి రచయిత అనారోగ్యం కారణంగా ఈరోజు తుది శ్వాసను విడిచారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 100 పైగా సినిమాల్లో పాటలను రాసిన ఆయన అకాల మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేస్తుందనే చెప్పాలి. చిత్రం,జయం, ఘర్షణ,వసంతం, 10త్ క్లాస్, నువ్వునేను లాంటి ఎన్నో సినిమాల్లో మంచి పాటలను రాసి ప్రేక్షకులను అలరించిన ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి తన అనారోగ్య కారణం చేత బాధపడుతున్నారు.
ఇక మొత్తానికైతే 2013 వ సంవత్సరంలో ఆయన మానసిక స్థితి బాగా లేకపోవడం వల్ల కాకినాడలోని ఒక గుడిలో శఠగోపం దొంగలిస్తు పట్టుబడ్డాడు. ఇక ఆ తర్వాత 2022 లో కూడా హైదరాబాద్ లోని ఆర్.బి.ఐ క్వార్టర్స్ లో గల ఆలయంలో ఒక బ్యాగ్ ను చోరీ చేస్తూ అరెస్టయ్యారు. ఇక ఏది ఏమైనా కూడా ఇదంతా ఆయన మానసిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల చేసిందే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు అని చాలామంది చెబుతూ ఉంటారు.
ఇక గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యం బారిన పడిన ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఈరోజు అక్కడే తన తుది శ్వాసను విడిచారు అంటూ తన కుటుంబ సభ్యులు ఒక వార్తని అయితే మీడియాకి తెలియజేశారు. మరి మొత్తానికైతే తన పాటలతో ప్రేక్షకులను పరవశింపజేసిన ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి…
ఇక కెరియర్ స్టార్టింగ్ లో ఈనాడులో జర్నలిస్టుగా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన ఆయన సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో పాటల మీద మమకారాన్ని పెంచుకొని లిరిసిస్ట్ గా మారడం అనేది ఆయన కెరియర్ కి ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి…ఇక ఆయన తేజ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలకు ఎక్కువగా పాటలను రాశారు…