MP Kesineni Nani: కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుంది విజయవాడ టీడీపీ పరిస్థితి. 2019లో గెలిచిందే ముగ్గురు ఎంపీలు. అందులో విజయవాడ ఒకటి. అది కూడ 4 వేల మెజార్టీతోనే. కాలం కలిసొచ్చింది కాబట్టి టీడీపీ ఖాతాలో పడింది. లేదంటే వైసీపీ వశమయ్యేది. ఇప్పుడు విజయవాడ టీడీపీలో వర్గపోరు రచ్చకెక్కుతోంది. ప్రతిపక్షాన్ని వదిలి సొంత పార్టీ నేతలతోనే విజయవాడ ఎంపీ వీధి పోరాటానికి దిగుతున్నారు.

విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. తనకు నచ్చని వాళ్లకు టికెట్ ఇస్తే సహకరించబోనని తేల్చి చెప్పారు. కేశినాని నానికి నచ్చని వారు ఎవరు అన్న చర్చ విజయవాడ రాజకీయాల్లో మొదలైంది. అసలు కేశినాని నాని ఎవరి పైన ఆగ్రహంగా ఉన్నారు.. ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు అన్న చర్చ టీడీపీలో సాగుతోంది.
విజయవాడ ఎంపీ సెగ్మెంట్ కింద వచ్చే నియోజకవర్గాల్లో తాను చెప్పిన వారే ఇంచార్జీలుగా ఉండాలని కేశినేని నాని భావిస్తున్నారు. కేశినేని నాని చెప్పినవారినే ఎలా ఇంచార్జీలుగా నియమిస్తామని టీడీపీ అంటోంది. కేశినేని టీడీపీలో తొలి నుంచి ఉన్న వ్యక్తి కాదు. 2014కు ముందు టీడీపీలో చేరారు. విజయవాడ ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు నడుచుకోవాలనడం నియంతృత్వమని టీడీపీ నేతలు అంటున్నారు.

కేశినేని నాని కోపం బుద్ధా వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరా, దేవినేని ఉమల పైనే. దీనికి కారణం వీరంతా కేశనేని చెప్పినట్టు వినేవారు కాదు. వీరంతా మొదటి నుంచి టీడీపీకి అండగా ఉన్నవారు. కేశినేని కంటే టీడీపీలో సీనియర్లు. నిన్న మొన్న వచ్చిన కేశినేని మాట ఎలా వింటాం అంటున్నారు. దీంతో కేశినేని నానికి కాలిపోతోంది. 2019లో పార్టీ ఓడిపోయినా తాను గెలిచానని, తన లాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కేశినేని భావిస్తున్నారు. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం పార్టీనే ఫైనల్ అంటోంది.
కేశినేని నానికి చంద్రబాబు పై కూడ కోపం ఉంది. దీనికి కారణం నాని తమ్ముడు చిన్నిని రాజకీయంగా ప్రోత్సహించడం. కేశినేని చిన్నికి కేశినేని నాని వ్యతిరేకులంతా గట్టి సపోర్ట్ ఇస్తున్నారు. దీంతో నానికి చిర్రెత్తుకొస్తోంది. పార్టీ నాయకత్వం పైన, స్థానిక నాయకత్వం పైనా కేశినేని నాని గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో తన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ల