సోషల్ మీడియా ప్రస్తుత పరిస్థితుల్లో సంచలనాలు సృష్టిస్తోంది. అనవసర పోస్టులు పెడుతూ పలు వర్గాల్లో విద్వేషాలు రె చ్చగొట్టేలా చేస్తోంది. దీంతో పలు నష్టాలు సైతం సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్రభావంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ట్విటర్ లాంటి సంస్థపై దాడులకు సైతం తెగబడింది. దీంతో ఇటీవల కాలంలో సోషల్ మీడియాపై పలు రకాల వదంతులు వినిపిస్తున్నాయి. ఈమేరకు ఇటీవల బీజేపీలో చేరిన సినీనటి విజయశాంతి సైతం స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవడంపై తన నిర్ణయాన్ని ప్రకటించారు.
విజయశాంతి గతంలో బీజేపీలో చేరారు తరువాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని అనతికాలంలోనే బహిష్కరణకు గురయ్యారు. పిదప కాంగ్రెస్ పార్టీలో చేరినా ఎ క్కువ కాలం ఉండలేకపోయారు. చివరికి మళ్లీ సొంత గూటికి చేరారు. సోషల్ మీడియాను కట్టడి చేయడంలో కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. విజయశాంతి బీజేపీలో చేరడంతోనే పార్టీ నిర్ణయాన్నిసమర్థిస్తున్నట్లు కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి.
సోషల్ మీడియాలో ఏవో పోస్టులు పెడుతూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. వినియో గదారుల వ్యక్తిగత వివరాల భద్రతకు బంగం వాటిల్లకుండా చూడటానికి కేంద్రం సోషల్ మీడియా కం పెనీలకు నిబంధనలు విధించినట్లు చెప్పారు. వివిధ వర్గాల మద్య విద్వేషాలు రగల్చడం, అత్యాచారాలు వంటి నేరాలను ప్రేరేపించే సందేశాలు సోషల్ మీడియాలో పోస్టు అయినప్పుడు వాటిని ముందుగా పోస్టు చేసిన వారి వివరాలు చె ప్పాలని శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే వాటిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
విజయశాంతి ట్వీట్ చేసిన విషయంపై న టిజన్లు మిశ్రమంగా స్పందించారు. కేంద్రప్రభుత్వం నియంత్రణ సమంజసమే అని కొందరు వ్యాఖ్యానిస్తే ఇంకొందరు ఇటీవల బెంగాల్ లో ఎన్నికల సందర్భంలో సోషల్ మీడియా సరిగా కట్టడి చేస్తే హింస జరిగి ఉండేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాపై విజయశాంతి చేసిన వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని వివరించారు.