North Korea: కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్నే వణికించింది. కానీ దాని అంతం ఇంతవరకు చూడలేదు. ఎక్కడో ఓ చోట దాని ఆనవాళ్లు బతికే ఉంటున్నాయి. దీంతో ప్రజలు నిత్యం నరక యాతన అనుభవిస్తున్నారు. ఎందరికో దడ పుట్టించిన ఉత్తర కొరియా ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ తో సతమతమవుతోంది. ప్రజానీకం పరేషాన్ అవుతున్నారు. రోజురోజుకు చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తూ ప్రజలను వణికిస్తోంది. దీనిపై దేశం అప్రమత్తంగా ఉన్నా వైరస్ మాత్రం భయపెడుతోంది. ఫలితంగా లక్షల మంది తమ బతుకుపై ఆందోళన చెందుతున్నారు.
దేశంలో బాధితుల సంఖ్య 8 లక్షలు దాటింది. రాజధాని ప్యోంగ్యాంగ్ నుంచే రోజువారి సంఖ్య పెరుగుతోంది. దాదాపు 3 లక్షల మంది చికిత్సలు తీసుకుంటున్నారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉవ్ పిలుపునివ్వడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. కొవిడ్ నేపథ్యంలో వ్యాక్సిన్లు, యాంటీ వైరల్ ట్రీట్ మెంట్ డ్రగ్స్, వంటివి అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా చాలా మంది వ్యాక్సిన్లు తీసుకోవడం లేదు. దీంతో వైరస్ తీవ్రత ఎక్కువవుతోంది.
Also Read: Tamannaah: ఎయిర్ పోర్ట్ లో తమన్నా ధగధగలు.. కొత్త పోజులు కేక ధగధగలు.. కొత్త పోజులు కేక
ఉత్తర కొరియా పొరుగు దేశాల సాయం చేసేందుకు ముందుకు వచ్చినా వద్దని చెబుతోంది. దీంతో టీకాలు అందుబాటులో లేకపోవడంతో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఫలితంగా ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమని సూచిస్తోంది. ఉత్తరకొరియా జీడీపీలో అరవై శాతం మిలిటరీ మీద ఖర్చు చేస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సర్వే ప్రకారం ఉత్తర కొరియా ఏడాదిలో ఒక డాలర్ కూడా ఖర్చు చేయడమే లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమైపోతోంది. కొవిడ్ విషయంలో గత రెండేళ్లుగా బయట దేశాలనుంచి సాయం పొందేందుకు ఇష్టపడటం లేదు. కరోనా భయంతో బయట దేశాల వారిని లోపలికి రానీయకున్నా వేరియంట్ ఎలా వ్యాపించిందో తెలియడం లేదు. దీంతో దేశం పరిస్థితి దయనీయంగా మారుతోంది. దేశంలో 64 వేల మందికి మాత్రమే కొవిడ్ పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది.
అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జర్మనీ, బ్రిటన్, చైనా వంటి దేశాలు సైతం కొవిడ్ తో అల్లాడిపోయిన సంగతి తెలిసిందే. కానీ ఉత్తర కొరియా మాత్రం దీనికి మినహాయింపు అని అనుకుంది. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే కొరియా కూడా కరోనా బారిన పడి తీవ్రంగా నష్టపోతోందని తెలుస్తోంది. దీంతో ప్రపంచానికి మరో ఉపద్రవం ముంచుకొచ్చినట్లేనా అనే సందేహాలు వస్తున్నాయి. దీనితో వైరస్ తీవ్రత మరింత పెరిగే అవకావాలు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కరోనా నిర్మూలనకు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.
Also Read:Congress Party: ఇక ప్రజల వద్దకు కాంగ్రెస్.. ఇప్పటికైనా లేస్తుందా?
Recommended Videos: