Gas Cylinder Price Decrease: కేంద్రం 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను శనివారం(ఫిబ్రవరి 1న) పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇందులో రైతులు, మహిళలు, ఎంఎస్‌ఎంఈలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇక ట్యాక్స్ పేయర్లకు అయితే చాలా మంచి ఊరట దక్కింది. ఆదాయ పరిమితిని రూ.8 లక్షల నుంచి ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది. దీంతో అందరూ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నారు. నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయాలను అభినందిస్తున్నారు. అయితే ఈ బడ్జెట్‌కు ముందే ప్రజలకు చమురు కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. 2025, ఫిబ్రవరి 1 నుంచి ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.7 తగ్గించాయి.. కొత్త రేట్లు ఫిబ్రవరి 1 నుంచి అమలవుతాయి. ఇక డొమెస్టిక్ సిలిండర్ ధరలో మాత్రం ఏమార్పు చేయలేదు. 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర 2024, ఆగస్టు 1 నుంచి స్థిరంగానే ఉంది. కమర్షియల్ సిలిండర్ ధరలు మాత్రం గత ఆగస్టు నుంచి ఐదు నెలలు పెరిగాయి. జనవరి నుంచి తగ్గుతున్నాయి. జనవరిలో రూ.14 తగ్గగా, ఇప్పుడు మరో రూ.7 తగ్గింది. అంతకు ముందు వరుసగా ఐదు నెలలు రూ.172 పెరిగింది. ఇప్పుడు తగ్గింది కేవలం రూ.21 మాత్రమే.
ప్రస్తుత ధరలు ఇలా…
దేశంలో వివిధ ప్రాంతాల్లో గ్యాస్ ధరలు వేర్వేరుగా ఉన్నాయ. రూ.7 తగ్గిన తర్వాత ఢిల్లీలో రూ.1,797(పాత ధర రూ.1,804), ముంబైలో రూ.1,749(పాత ధర రూ.1,756), కోల్‌కతాలోఊ.1,907(పాత ధర రూ.1,911), చెన్నైలో రూ.1,959(పాత ధరూ1,966)గా ఉంది. ఇక 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర పరిశీలిస్తే ఢిల్లీలో రూ.803, ముంబైలో రూ.802.50, కోల్‌కతాలో రూ.829, చెనై్నలో రూ.818.50 గా ఉంది.
సామాన్యులకు ఊరట..
కమర్షియల్ సిలిండర్ ధర తగ్గితే సామాన్యులకుఎలాంటి ఊరట ఉండదనుకుంటాం. కానీ, సామాన్యులకు కూడా ఊరటే. సిలిండర్ ధర పెరిగితే తినుబండారాల ధర పెరుగుతుంది. తగ్గితే ధర తగ్గుతుంది. తద్వారా ఉపశమనం లభిస్తుంది.
సిలిండర్ ధరను ఎవరు నిర్ణయిస్తారు?
దేశంలో ఎల్‌పీజీ(లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయిస్తాయి. ఈ కంపెనీలు ఏవంటే.. కంపెనీలను పరిశీలిస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీ), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) ఉన్నాయి. ఈ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా ఎల్‌పీసీ సిలిండర్ల ధరను ప్రతీనెల 1న నిర్ణయిస్తాయి.