https://oktelugu.com/

Social media activists: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. అరెస్ట్ లు మొదలుపెట్టిన పోలీసులు

Social media activists ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో ఒక లెక్క.. అడ్డూ అదుపూ లేదని ఇష్టానుసారం తనకూ ఉందని ‘ఫేస్ బుక్’లో పోస్టులు పెట్టి ఇతరులను విమర్శిస్తున్నారా? అయితే ఇక మీరు బుక్కైనట్టే.. ఎందుకంటే అసభ్యకర పోస్టులు పెడుతూ సినీ, రాజకీయ ఇతర ప్రముఖులను అవమానిస్తున్న వారిపై పోలీసులు కొరఢా ఝలిపస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఓ చిన్న యూట్యూబ్ చానెల్ ప్రారంభించి దుమ్మెత్తిపోస్తున్న వారి పని పట్టారు పోలీసులు. వారిని అరెస్ట్ […]

Written By: , Updated On : January 8, 2022 / 02:01 PM IST
Follow us on

Social media activists ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో ఒక లెక్క.. అడ్డూ అదుపూ లేదని ఇష్టానుసారం తనకూ ఉందని ‘ఫేస్ బుక్’లో పోస్టులు పెట్టి ఇతరులను విమర్శిస్తున్నారా? అయితే ఇక మీరు బుక్కైనట్టే.. ఎందుకంటే అసభ్యకర పోస్టులు పెడుతూ సినీ, రాజకీయ ఇతర ప్రముఖులను అవమానిస్తున్న వారిపై పోలీసులు కొరఢా ఝలిపస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఓ చిన్న యూట్యూబ్ చానెల్ ప్రారంభించి దుమ్మెత్తిపోస్తున్న వారి పని పట్టారు పోలీసులు. వారిని అరెస్ట్ చేసి అందరు సోషల్ మీడియా యాక్టివిస్టులకు గట్టి హెచ్చరికలు పంపారు.

ఇక నుంచి తెలంగాణలో ఎక్కడ ఎవరు పోస్టులు పెట్టిన జర ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిందే.. ఫేస్ బుక్, యూట్యూబ్ ఉంది కదా అని ఏది పడితే అది వాగేసి , రాసేస్తే పోలీసులు ఉన్నారు జాగ్రత్త. తాజా అరెస్ట్ లతో ఓ రకంగా సోషల్ మీడియా యాక్టివిస్టులకు పోలీసులు షాక్ ఇచ్చినట్టే లెక్క.

ఇటీవల కాలంలో జర్నలిజం చేయనోళ్లు కూడా మైక్ , పెన్ను పట్టుకొని పోలోమని సమాజంలోకి వచ్చేస్తున్నారు. ఒక యూట్యూబ్ చానెల్ పెట్టేసి తాము కూడా రిపోర్టర్లం అని కవరింగ్ ఇచ్చేస్తున్నారు. వాళ్లకు వాళ్లే ‘ప్రెస్’ అని కార్డులు కొట్టించుకొని ఇటు పోలీసులను, ఇతరులను బెదిరిస్తున్నారు. మీడియా తమ చేతుల్లో ఉందని దబాయిస్తున్నారు.

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అయిన యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లలో చానల్స్ పేరిట అక్రమంగా ఎలాంటి అనుమతులు కానీ.. రిజిస్ట్రేషన్ కానీ లేకుండా కొందరు రిపోర్టర్లుగా చలామణీ అవుతూ అసభ్యకరమైన, అవమానకరమైన విద్వేశపూరితంగా వారి సొంత ఆరోపణలు, సొంత అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలుగా చిత్రీకరిస్తూ పోస్టులు పెట్టడం పరిపాటగా మారింది. వీరికి ఎంతటి వారైనా మినహాయింపు లేదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, సెలబ్రెటీలు మొదలగు వారిని టార్గెట్ చేస్తూ తప్పుడు పోస్టులు పెట్టి వైరల్ చేసి ఆదాయం పొందడం వీరి ఉద్దేశం.

కొన్ని పోస్టులు కారణంగా వివిధ వర్గాల మధ్య, పార్టీల మధ్య వైషమ్యాలను పెంచి ఉద్రిక్తతలకు దారితీసిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు కొరఢా ఝలింపించారు.

తాజాగా అక్రమ చానెళ్లు నడుపుతూ రిపోర్టర్లుగా చలామణీ అవుతున్న వారిని అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో యూట్యూబ్ పెట్టి విలేకరులుగా చలామణీ అవుతూ ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించినందుకు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేసి షాక్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఏ న్యూస్ చానెల్ లేదా ప్రింట్ మీడియా అయినా అనుమతులు తప్పనిసరి అని.. రిపోర్టర్లు, ఎడిటర్లకు అక్రిడిటేషన్ కార్డు, సంబంధిత వార్త సంస్థ నుంచి నియామక పత్రం ఉంటేనే వారిని విలేకరులుగా గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. ఇవేవీ లేకుండా సోషల్ మీడియాలో పెడితే మాత్రం ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరించారు.

ఇక కరీంనగర్ పోలీసులు ఒక అడుగు ముందుకేసి ఏకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు అరికట్టేందుకు కరీంనగర్ కమిషనరేట్ లో ఒక ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక సీఐతోపాటు ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. సో ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారు బీ అలెర్ట్..