Gulf Countries Ruling India నుపూర్ శర్మ కేసులో పరిణామాలు ఎటువైపో దారితీస్తున్నాయి.. గల్ఫ్ దేశాలు దీనిపై భారత్ ను శాసించబోతున్నాయా? అదే సమయంలో భారత్ కూడా గల్ఫ్ దేశాలను ప్రశ్నించే పరిస్థితి ఉందా? ఇది అందరి మనసులో గూడుకట్టుకొని ఉంది.
నుపూర్ శర్మ చట్ట వ్యతిరేకంగా మాట్లాడితే భారత ప్రభుత్వం చట్టపరంగా శిక్షించే అవకాశం ఉంది. కానీ గల్ఫ్ దేశాలు దీన్ని ఒక తప్పుగా చూపించే ప్రయత్నం చేయడాన్ని భారత ప్రభుత్వం ఖండించాల్సి ఉంది. మన తప్పును మనం లోపల మాట్లాడుకోవాలి. ఇది దేశానికి సంబంధించిన సమస్య. అందరం ఒక్కటి కావాలి.
అసలు ఈ గల్ఫ్ దేశాలు మాట్లాడే అర్హతలేనివి. ఇక్కడ ప్రజాస్వామ్యమే లేదు. అలాంటి వాటికి మాట్లాడే రైట్స్ లేవు. హుస్సేన్ మన సరస్వతి దేవీని నగ్నంగా చిత్రాలు వేసినప్పుడు ఆయన ఖతార్ లో ఉన్నాడు. ఆయనపై ఏం చర్యలు తీసుకున్నారు? జకీర్ నాయక్ మలేషియాలో ఉంటూ భారత్ లో విద్వేశాలు రెచ్చగొట్టాడు. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. హిందువులపై మాట్లాడితే ఈ ఇస్లాం దేశాలు ఎందుకు చర్యలు తీసుకోలేదు.
గల్ఫ్ దేశాలతో భారత్ కు వ్యాపార, మానవసంబంధాలు ఎక్కువ. గల్ఫ్ లో 89 లక్షల మంది భారత సంతతి మంది నివసిస్తున్నారకు. యూఏఈలో మొత్తం జనాభాలో 35శాతానికి పైగా భారత సంతతి వారే. అయితే కొద్దిమందికే పౌరసత్వం ఉంది. కువైట్, ఖతార్ లలో 25శాతం మంది భారతీయులే. బహ్రెయిన్ లో 19 శాతం, ఒమన్ లో 15 శాతం, భారత్ లో 7.5శాతం భారతీయులు ఉన్నారు.
మన వ్యాపార విదేశీ వాణిజ్యంలో 9.2 శాతం ఒక్క యూఏఈతోనే చేస్తున్నారు. 73 బిలియన్ డాలర్ల ఒప్పందం ఆ దేశంతో ఉంది. ఆయిల్ 60 శాతం గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు ఆహారం 80 శాతం సరఫరా చేస్తోంది. ఇలా భారత్-గల్ప్ దేశాల మధ్య ఇద్దరికీ ఇద్దరి అవసరం ఉంది. కానీ గల్ఫ్ దేశాలకు తలొగ్గి ఉండాల్సిన పరిస్థితి ఉంది. వారి ఆధిపత్యాన్ని సహిద్దామా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.