NPS Vatsalya Scheme : అటువంటి తల్లిదండ్రుల కోసం తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పథకం పేరు ఎన్ పి ఎస్ వాత్సల్య యోజన పథకం. మీ పిల్లల భవిష్యత్తు రిటైర్మెంట్ కోసం ముందుగానే మీరు పెట్టుబడి పెట్టే అవకాశం ఈ పథకంలో ఉంది. ప్రతినెలా ఈ పథకంలో వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే మీ పిల్లలు వృద్ధాప్యంలోకి వచ్చిన సమయంలో వారికి నాలుగు కోట్లకు పైగా నిధి అందుతుంది. ఎన్ పీ ఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఎన్పీఎస్ పథకాన్ని పింఛన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది.
Also Read : రేవంత్ రెడ్డిది.. నిజాయతీ లేక నిస్సహాయత?
పిల్లల పేరు మీద తల్లిదండ్రులు ఎన్ పి ఎస్ ఖాతా ఓపెన్ చేసి వాళ్ల చిన్నతనం నుంచి వాళ్ళ భవిష్యత్తు కోసం పొదుపును మొదలు పెట్టవచ్చు. ఈ పథకం మీ పిల్లల శిశు వయస్సు నుంచే ప్రారంభం అయ్యి ఆ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వలన పెద్ద మొత్తాన్ని అందుకోగలుగుతారు. అందరికీ కూడా ఈ పథకం చెరువగా ఉండేలాగా దీనిని రూపొందించడం జరిగింది. ప్రతినెల 1000 రూపాయలు పెట్టుబడి పెడితే ఎకౌంటు ఓపెన్ అవుతుంది. సామాన్యులు కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కరికి వీలుబాటు ఉండే పథకాలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పొచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే ఒక వ్యక్తి తనకు బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డ పేరు మీద ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను ఓపెన్ చేశాడు.
అతను ప్రతి నెల ఈ ఖాతాలో వెయ్యి రూపాయల చొప్పున తన బిడ్డకు 18 ఏళ్లు వచ్చేవరకు డిపాజిట్ చేశాడు. ఆ 18 ఏళ్లలో అతను తన బిడ్డపై పెట్టిన పెట్టుబడి మొత్తము రూ.2,28,000 మాత్రమే అవుతుంది. కానీ అతను తన బిడ్డ పేరు మీద అకౌంట్లో ఉండే మొత్తం వడ్డీతో కలిపి దాదాపు రూ.6.75 లక్షలు అవుతుంది. ఆ పిల్లవాడు పెద్దవాడు అయ్యేవరకు ఇదే అమౌంట్ను అకౌంట్లో కొనసాగించినట్లయితే అతనికి 60 ఏళ్ళు వచ్చేవరకు ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున పెట్టుబడి చేస్తే 60 ఏటా అతనికి మొత్తంగా రూ.4.40 కోట్లు అందుతాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వలన ఇది సాధ్యమవుతుందని చెప్పొచ్చు. ఎంత త్వరగా ఈ పథకాన్ని ప్రారంభిస్తే ఆ తర్వాత అంత లాభం పొందుతారు.
Also Read : న్యాయవ్యవస్థకి ‘లంచం’ మకిలి.. గాలి జనార్దన్ రెడ్డి మామూలోడు కాదు!