Homeఅంతర్జాతీయంఅమెరికాకు రావడానికి వారికి నో పర్మిషన్‌..

అమెరికాకు రావడానికి వారికి నో పర్మిషన్‌..

ప్రపంచంలో ఏ దేశం నుంచైనా ఏ దేశానికైనా ఎవరైనా వెళ్లొచ్చు. అందుకు కొన్ని షరతులు ఉంటాయి. వాటిని పాటిస్తూ ఇతర దేశాల్లో అడుగుపెట్టొచ్చు. అయితే.. అవకాశాలకు పెట్టింది పేరైన అమెరికా మాత్రం తాజాగా కొన్ని నిబంధనల విధించింది. ఏ దేశానికి చెందినవారైనా.. వారు కమ్యూనిస్టు పార్టీ సభ్యులు లేదా నిరంకుశ అధికారం చెలాయించే తరహా పార్టీల సభ్యులు మాత్రం ఇకపై అమెరికాలో అడుగుపెట్టడానికి వీలులేదట.

Also Read: భారత్ లో కరోనా మరణాలు తగ్గడానికి అసలు కారణమిదే..?

తమ దేశంలో ప్రవేశానికి ‘కమ్యూనిస్టు/నిరంకుశ పార్టీల సభ్యత్వమే’ అనర్హతగా పేర్కొంటూ.. అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్‌ సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) తాజాగా విధాన మార్గదర్శకాల పత్రాన్ని జారీ చేసింది. నిజానికి, కమ్యూనిస్టు పార్టీ సభ్యులకు అమెరికాలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ 1952లోనే చట్టం చేశారు. ఇప్పుడు దాన్ని కఠినంగా అమలు చేసేలా విధాన మార్గదర్శకాలను తెచ్చారు. అమెరికా భద్రత కోసమే ఈ మార్గదర్శకాలను విడుదల చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

వాణిజ్యం, హాంకాంగ్‌ భద్రత చట్టం, జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో వీఘర్‌ ముస్లింలపై ఉక్కుపాదం లాంటి అంశాల్లో చైనాతో పెరుగుతున్న విభేదాల నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషిస్తున్నారు. అమెరికా లక్ష్యం చైనానే అయినా.. దీని ప్రభావం భారత్‌ సహా, ప్రపంచంలోని పలు దేశాల కమ్యూనిస్టు పార్టీ సభ్యులపై ఉంటుందని వారు పేర్కొంటున్నారు. కాగా.. గత్యంతరం లేని పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలో చేరినవారికి మినహాయింపు ఉంటుందని 1952 చట్టంలోనే పేర్కొన్నారు. దాన్ని ఇప్పుడూ కొనసాగిస్తారు.

Also Read: ట్రంప్ కు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్‌.. కుదుటపడుతున్న ఆరోగ్యం. .

అమెరికా ప్రధానంగా చైనాను టార్గెట్‌ చేసి ఈ విధానాన్ని పటిష్టం చేసినట్లు తెలుస్తోంది. కమ్యూనిస్టు దేశమైన చైనా నుంచే ప్రజలను అమెరికాకు రాకుండా అడ్డుకోవాలని చూస్తోంది. ఇప్పటికే చైనాను పలువిధాలా దెబ్బతీస్తున్న అమెరికా.. ఇప్పుడు ఈ రకంగానూ జైలులో పడేసినట్లు చేసింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version