కరోనా వైరస్ కారణంగా విద్యుత్ సంస్థలు స్పాట్ బిల్లింగ్ విధానాన్ని నిలిపివేయాలని నిర్ణటించాయి. వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు కోసం తాత్కాలికంగా నూతన విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. గత మూడు నెలల సగటు విద్యుత్ వినియోగాన్ని మార్చి నెల విద్యుత్తు బిల్లుగా పరిగణించాలని సూచించారు. ఈ మొత్తాన్ని వెబ్సైట్లో ఉంచనున్నారు. ఆన్లైన్ ద్వారా బిల్లు మొత్తాన్ని చెల్లించాలని వినియోగదారులకు సూచిస్తున్నారు. విద్యుత్ వాస్తవ వినియోగం ప్రకారం బిల్లు మొత్తంలో హెచ్చుతగ్గులు ఉంటే తర్వాతి నెలలో సర్దుబాటు చేస్తారు. మీటర్ రీడింగ్ ఆధారంగా విద్యుత్ వినియోగ ఛార్జీలను సిబ్బంది ప్రతి నెలా ఇంటింటికీ వచ్చి అందిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా స్పాట్ బిల్లింగ్ నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు జేఎండీ చక్రధరబాబు తెలిపారు.