హైదరాబాద్‌లో ఎక్కడా రెడ్‌జోన్‌ లేదు

హైదరాబాద్‌లో ఎక్కడా రెడ్‌జోన్‌ అంటూ లేదని, ఈ విషయమై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటివి ప్రజల్లో ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఒకే కుటుంబంలో ఎక్కువ మందికిసోకడమేనని మంత్రి చెప్పారు. కుత్బుల్లాపూర్‌ ఏరియా నుంచి ఒకే కుటుంబం నుంచి నాలుగు కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ఎంత […]

Written By: Neelambaram, Updated On : March 29, 2020 8:01 pm
Follow us on

హైదరాబాద్‌లో ఎక్కడా రెడ్‌జోన్‌ అంటూ లేదని, ఈ విషయమై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటివి ప్రజల్లో ఆందోళన కలిగిస్తుందని చెప్పారు.

కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఒకే కుటుంబంలో ఎక్కువ మందికిసోకడమేనని మంత్రి చెప్పారు. కుత్బుల్లాపూర్‌ ఏరియా నుంచి ఒకే కుటుంబం నుంచి నాలుగు కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ఎంత మంది కరోనా రోగులు ఉన్నా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి భరోసా ఇచ్చారు.

కావాల్సిన యంత్ర పరికరాలు అన్ని అందుబాటులో ఉన్నాయని చెబుతూ మరో ఆరు రోజుల్లో గచ్చిబౌలిలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఆరు ఫ్లోర్‌లు రెడీ అవుతాయని తెలిపారు. ఇందులో 1500 పథకాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. గాంధీ వైద్యులకు వారి వారి ఏరియాల్లో ప్రజలెవ్వరూ ఇబ్బంది పెట్టొద్దని మంత్రి కోరారు. ఇంటి అద్దెకు ఇచ్చిన వారు ఇబ్బంది పెట్టొద్దని హితవు చెప్పారు.

వైద్యులకు అండగా సమాజంలోని ప్రజలు అందరూ ఉండాలని మంత్రి కోరారు. క్వారంటైన్‌లో ఉన్న వారి సంఖ్య తగ్గుతుందని చెప్తూ ప్రస్తుతం 13వేల మంది ఉన్నారని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతగా ఉండాలని మంత్రి హితవు చెప్పారు.

కాగా, ప్రార్ధనా మందిరాల్లోకి వెళ్లి ఇబ్బంది పడొద్దని, ఇంటి దగ్గర ప్రార్ధనలు చేసుకోవాలని మంత్రి సూచించారు. వైద్యులు, ఎయిర్‌పోర్ట్‌లోని స్ర్కీనింగ్‌లో పనిచేసే సిబ్వంది నలుగురికి కరోనా సోకింది. వారి కుటుంబాలకు పరీక్షలు చేస్తున్నట్టుచె ప్పారు. రోగుల దగ్గర పనిచేసే సిబ్బంది ఎప్పటికప్పుడు చెక్‌చేసుకోవాలని మంత్రి సూచించారు.

వైద్య ఆరోగ్యశాఖలో పనిచసే సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వహించేలా ఏర్పాటు చేసినట్టుమంత్రి తెలిపారు. వైద్యులకు అవసరమైతే పది రోజులు విధులు, మరో పది రోజులు లీవ్‌ ఇస్తామని తెలిపారు. 65 మంది పాజిటివ్‌ వ్యక్తుల్లో పది మంది రోజగులకు నెగిటివ్‌ వచ్చింది. రేపు మరోసారి పరీక్ష చేసి డిశ్చార్చి చేస్తామని పేరోన్నారు.