Nirmala Sitharaman : పన్నులను వివిధ రూపాలలో ప్రభుత్వాలు వసూలు చేస్తూ ఉంటాయి. వాటిని కేంద్ర ఖజానాకు మళ్ళించి తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటాయి. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ప్రయోజనాల ఆధారంగా చేపడుతుంటాయి. అయితే ఈ పన్నుల వసూళ్లు ఒక్కో ప్రాంతంలో ఒక్క విధంగా ఉంటాయి. దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మనదేశంలో గతంలో వివిధ రకాలుగా పన్నులు ఉండేవి. అయితే వీటివల్ల నల్లధనం పేరుకు పోతోందని.. ప్రభుత్వానికి వచ్చే నగదు రావడంలేదని భావించి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ(goods and service tax) ని 2017 జూలై 30న అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఏకరూప పన్ను చెల్లింపు వ్యవస్థ ఏర్పడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. జిఎస్టిని సెంట్రల్ జిఎస్టి, స్టేట్ జీఎస్టీ గా విభజించింది. కేంద్రం తద్వారా రాష్ట్రాలకు పన్నుల నగదును జమ చేస్తోంది.. అయితే జీఎస్టీ లో వివిధ స్లాబుల ఆధారంగా పన్నులు ఉన్నాయి. వస్తు సేవల ఆధారంగా స్లాబులను విధిస్తున్నారు. అయితే ఈ స్లాబుల ఏర్పాటుపై రకరకాల విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ కేంద్రం ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. పైగా స్లాబుల పరిధిలోకి వివిధ వస్తువులను చేర్చుతున్నది. పన్ను వసూలు విధానానికి సరికొత్త భాష్యాన్ని చెబుతున్నది.
నిర్మలమ్మ రూట్ సపరేటు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మల సీతారామన్ వ్యవహరిస్తున్నారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి – మార్చి కాలంలో బడ్జెట్ ను ఆమె ప్రవేశపెడుతున్నారు.. ఈ క్రమంలో జీఎస్టీ స్లాబుల విషయంలో సరికొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. ఇటీవల చెస్ ఛాంపియన్ గుకేష్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అయితే అతడు చెస్ ఛాంపియన్ గెలవడం ద్వారా వచ్చిన నగదులో పావు కంటే ఎక్కువ శాతం పన్నుగా చెల్లించడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజెన్లు సోషల్ మీడియాలో నిర్మల సీతారామన్ ను ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు. దాన్ని మర్చిపోకముందే సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయాలపై చెల్లించాల్సిన పన్నును సరికొత్తగా వివరించారు నిర్మల సీతారామన్. ఉదాహరణకు ఒక వ్యక్తి 12 లక్షలకు ఒక కారు కొనుగోలు చేస్తే.. దానిని సెకండ్ హ్యాండ్ లో 9 లక్షలకు విక్రయిస్తే.. ఆ తొమ్మిది లక్షలపై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే సెకండ్ హ్యాండ్ కారు ను మూడు లక్షల నష్టానికి అమ్మినా కూడా దానిపై టాక్స్ చెల్లించాల్సిందే. దీనిపై నిర్మల సీతారామన్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. ఇన్నాళ్లు లాభం మీద మాత్రమే పన్ను చెల్లించే వాళ్ళం. ఇకపై నష్టం పై కూడా చెల్లించాల్సి వస్తుంది. తీసుకునే ఊపిరిపై కూడా పన్ను విధించే అవకాశం ఏమైనా ఉందా నిర్మలమ్మ అంటూ సెటైరికల్ గా కామెంట్ చేశాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మీకు అలా అర్థమైందా అంటూ ఆ నెటిజన్ పై మండిపడుతున్నారు. సెకండ్ హ్యాండ్ లో వాహనాలను తక్కువకే అమ్ముతారని.. మరి ఇన్నాళ్లు వాడినందుకు దానిపై ఏమైనా పన్ను చెల్లిస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా దర్శనమిస్తోంది.
ఇన్నాళ్లు లాభం మీద మాత్రమే పన్ను… ఇప్పుడు మేము నష్టానికి కూడా పన్ను వేస్తున్నాం…
కారు 12 లక్షలకు కొని, తొమ్మిది లక్షలకు అమ్మితే, ఆ తేడా మూడు లక్షల మీద 18% పండు కట్టాలి.. అంతే..
జింతాత జిత జిత….
జనాలు విపరీతంగా ఊపిరి తీసుకుంటున్నారు… ఊపిరి మీద కూడా ఆలోచించండమ్మా pic.twitter.com/W85DvvJtbM
— ๒ђครкคг (@shivsun) December 22, 2024