PM Modi Vs Opposition Parties Leaders: ” నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు. దర్యాప్తు సంస్థలను వాడుకుని ప్రతిపక్షాలను బెదరగొడుతున్నారు.. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు” ఇలా సాగిపోయింది ఢిల్లీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, కెసిఆర్, మమతా బెనర్జీ, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వారు మోడీకి రాసిన లేఖ. మోడీ దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని తమను వేధిస్తున్నారని ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్నారు. అంతే కాదు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియాను అకారణంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తుతున్నారు.. కానీ ఇక్కడ వారు మర్చిపోయిందంటంటే.. వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రతిపక్షాలలో ఏ విధంగా హింసిస్తున్నారో, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ఏ విధంగా హక్కులను కాల రాస్తున్నారో అందరికీ విధితమే.
Also Read: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై టీడీపీ అభ్యర్థి ఆయనే
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శారద కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొన్న వారిని విచారించినందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు వెళ్లినప్పుడు మమతా బెనర్జీ ఎటువంటి దాస్టికానికి పాల్పడ్డారు భారతదేశం మొత్తం చూసింది. కానీ ఆమె కూడా చివరికి మోడీ వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తోంది. నందిగ్రామ్ లో కమ్యూనిస్టు పార్టీ నాయకులను ఏ విధంగా హత మార్చారో, కలకత్తాలో భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలను ఎలా నరికి చంపారో పశ్చిమ బెంగాల్ ప్రజలకే కాదు, భారత్ లోని అన్ని వర్గాల వారికీ తెలుసు. పని పెళ్లి కళ్ళు మూసుకుని పాలు తాగి లోకమంతా చీకటిగానే ఉన్నట్టు.. తన హత్యా రాజకీయాలు చేస్తున్నప్పటికీ… అవేవీ చెప్పకుండా మోదీపై ధ్వజమెత్తడం మమతా బెనర్జీ కే చెల్లింది.
ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలను ఎలా కకావికలం చేసింది అందరికీ తెలిసిందే. తనకు గిట్టని వారిపై కేసులు పెట్టడం, తన సొంత పార్టీలో అసమ్మతిని సహించలేకపోవడం, హక్కుల కోసం ఉద్యమిస్తున్న వారిని జైళ్ళల్లో పెట్టడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన 8 ఏళ్ల పాలనలో ఎన్నో ఆకృత్యాలు జరిగాయి. చివరికి తెలంగాణ ఉద్యమకారులపై దాడులు చేసిన వారికి కూడా పదవులు దక్కాయి. కానీ ఇవేవీ పట్టించుకోని కేసీఆర్.. నీ పాలన బాగోలేదు, ఈ పద్ధతి బాగోలేదు, ఇది సరికాదు అంటూ మోదీని విమర్శించడం పూర్తి అబ్సర్డ్.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్… పాలనలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయో రోజూ పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. పంజాబ్లో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడికి భద్రతను తగ్గించడం ద్వారా అతడు హత్యకు గురయ్యాడు. దీనంతటికీ కారణం ఆ పంజాబ్ ముఖ్యమంత్రి నిర్వాకమే. మొన్న ఖలిస్థాన్ మద్దతుదారులు చేసిన దౌర్జన్యాన్ని యావత్ భారత్ మొత్తం చూసింది. ఢిల్లీలో లిక్కర్ స్కాం, పాఠశాల తరగతి గదుల నిర్మాణం స్కాంలో కోట్లు చేతులు మారాయని తెలుస్తోంది. ఇవేవీ తన మరకలుగా, పాలన లోపాలుగా ప్రతిపక్ష ముఖ్యమంత్రులకు అన్పించడం లేదు.. పైగా గురువింద గింజలు లాగా తమ నలుపులు ఎరగకుండా మోదీని విమర్శించడం వారికి పరిపాటిగా మారింది.. దీనికి తోడు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులను విమర్శించడం వారికి రివాజు అయిపోయింది.. మరి మోడీ చేతిలో సిబిఐ, ఈడి ఉంటే.. వారి రాష్ట్రాల్లో పోలీసులు, ఇతర అధికారులను ఎలాంటి చర్యలకు వాడుతున్నారో, ప్రతిపక్షాలను ఎలాంటి ఇబ్బందులు పెట్టేందుకు ఉపయోగిస్తున్నారో అందరికీ తెలిసిందే.. మోదిని విమర్శించే ముందు ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా చెప్తే అందరికీ తెలుస్తుంది.. అంతేకాని ‘కొత్వాల్ కో ఉల్టా డాంటే” అనే సామెతలాగా మాట్లాడితేనే జనానికి విసుగు వస్తుంది. అన్నట్టు తన పాలనలో ఉత్తరప్రదేశ్లో గుండా రాజ్ గా మార్చిన అఖిలేష్ యాదవ్ కూడా మోడీకి నీతులు చెప్తున్నాడు. పాపం మొన్న ప్రయాగ్ రాజ్ హత్య కేసులో తన సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఉన్నాడని, అతడు ఎన్ కౌంటర్ లో హతమయ్యాడనే విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు. అయ్యా… ప్రతిపక్షాల ముఖ్యమంత్రులు మీ పాలన, కుటుంబ సభ్యుల జోక్యం అందరికీ తెలుసు. ఇప్పుడుసలే సోషల్ మీడియా రోజులు. చీమ చిటుక్కుమన్నా తెలిసే రోజులు. అన్నింటికీ మించి ఎవరు ఏమిటో ప్రజలు తెలుసుకునే రోజులు.. ఆస్తమానం ప్రజల కళ్ళకు గంతలు కట్టలేరు. మోసం చేయలేరు.
Also Read:Ippatam Issue: ఇప్పటంలో కూల్చి వైసీపీ సర్కార్ ఏం సాధించింది?