https://oktelugu.com/

నిమ్మగడ్డ బదిలీ ‘అస్త్రం’

ఏపీ ఎన్నికల కమిషనర్ రమేశ్ ఇదివరకే తన శాఖలోని పలువురు ఉద్యోగులపై బదిలీ వేటు వేశారు. వీరిలో కొంత మంది ఐపీఎస్.. ఐఏఎస్ లు సైతం ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ సైతం రాశారు. ఈ దశలోనే పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ బదిలీ అయ్యారని సమాచారం.. వీరిద్దరి బదిలీలను ధృవీకరిస్తూ.. మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్ఈసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ముఖ్య కార్యదర్శి […]

Written By: , Updated On : January 26, 2021 / 03:31 PM IST
Follow us on

Nimmagadda
ఏపీ ఎన్నికల కమిషనర్ రమేశ్ ఇదివరకే తన శాఖలోని పలువురు ఉద్యోగులపై బదిలీ వేటు వేశారు. వీరిలో కొంత మంది ఐపీఎస్.. ఐఏఎస్ లు సైతం ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ సైతం రాశారు. ఈ దశలోనే పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ బదిలీ అయ్యారని సమాచారం.. వీరిద్దరి బదిలీలను ధృవీకరిస్తూ.. మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్ఈసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ముఖ్య కార్యదర్శి ఇప్పటికే బదిలీ అయ్యారు. ఆయన ఇంకా ఎంతమంది అధికారులను బదిలీ చేసుకున్నా.. తాము పట్టించుకోమని అన్నారు.

Also Read: ఏపీలో ‘పంచాయితీ’ హీట్‌

ఇద్దరు ఉన్నతాధికారులపై ఎస్ఈసీ బదిలీ వేటు వేశారని అనుకుంటున్న సమయంలో.. ఎన్నికల కమిషన్ నుంచి ఓ లేఖ విడులైంది. ఆ ఇద్దరు అధికారుల బదిలీలను తిరస్కరిస్తూ.. అందులో సారాంశం ఉండడం గమనార్హం. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణగా బదిలీలు జరుగున్నాయి. రీ షెడ్యూల్ కూడా విడులైంది. ఇలాంటి తరుణంలో ఇద్దరు అధికారులను బదిలీ చేయడం సరైన చర్య కాదు అని .. కొత్తగా వచ్చిన అధికారులు ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లరని ఎన్నికల కమిషన్ ఓ ప్రకటన చేసింది.

బదిలీ చేసింది ఎస్ఈసీ అయితే.. దానిని ఎన్నికల కమిషన్ ఎందుకు తిరస్కరిస్తుంది. ఒకవేళ బదిలీ నిజమేనా.. కాదా.. మరి నిప్పులేకుండా పొగ ఎందుకు వచ్చింది..? ఒకవేళ బదిలీ చేసి ఆ తప్పును ప్రభుత్వంపైకి నెట్టే కార్యక్రమం జరుగుతుందా..? అనే ప్రశ్నలన్నింటికీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి సమాధానం వస్తే.. బాగుంటుంది.

Also Read: చదువు నేర్పిన మూర్ఖత్వం.. : బిడ్డలను చంపుకున్న కన్నపేగు..

అదే విధంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు అవుతోంది. ఈ తరుణంలో బదిలీలు సాధ్యం కాదు. బదిలీ చేయాలనుకుంటే ఎన్నికల ప్రవర్తనా నియామాళిని అనుసరించాల్సి ఉంటుంది. మరీ ఏకంగా ఇద్దరు ఉన్నతాధికారులను ఎస్ఈసీ బదిలీ చేయడంపై అంతర్యం ఏమిటీ అర్థం కావడం లేదని ఏపీ ప్రజలు.. విశ్లేషకులు అంటున్నారు. అసలు కోడ్ ఉండగా ప్రభుత్వానికీ బదిలీ చేసే అధికారం ఉండదు. ఎన్నికలే వద్దంటున్న ప్రభుత్వానికి బదిలీలు చేయాల్సిన అవసరం ఏంటని ఈ లీలల వెనక ఎవరున్నారని పలువురు అనుకుంటన్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్