కొద్దిరోజులుగా ఏపీ ప్రభుత్వంతో సామరస్యంగా ఉంటూ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన ఏపీ హైకోర్టులో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బయటపడ్డారు. మరో సంచలన పిటీషన్ వేశారు. తాను గవర్నర్ తో జరుపుతున్న ఉత్తరప్రత్యుత్తరాలు అన్నీ బయటకు లీక్ అవుతుండడంపై విచారణ జరపాలని నిమ్మగడ్డ కోరారు. సీబీఐతో విచారణ జరిపించాలని విన్నవించారు.
తాను గవర్నర్ కు రాస్తున్న ప్రివిలేజ్ లెటర్స్ అన్నీ ఆఫీస్ నుంచి ఎలా బయటకు వస్తున్నాయో తేల్చాలన్నారు. సెలవు పెడుతున్న లేఖలు కూడా బయటకు వస్తున్నాయని పిటీషన్ లో ప్రస్తావించారు.
తాను గవర్నర్ కు రాసిన లేఖలను సోషల్ మీడియాలో చూశామని మంత్రులు చెబుతున్నారని నిమ్మగడ్డ పిటీషన్ లో ప్రస్తావించారు. ఇదేలా సాధ్యమో విచారణ జరపాలని కోరారు.
ఈ పిటీషన్ లో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎస్, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటీషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.