https://oktelugu.com/

మంత్రి నానిపై ఎస్‌ఈసీ సీరియస్‌..: కేసు నమోదు

ఏపీలో ఇప్పుడు మంత్రి కొడాలి నాని.. వర్సెస్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మధ్య వార్‌‌ నడుస్తోంది. ముందే ప్రభుత్వంపై సీరియస్‌గా వ్యవహరిస్తున్న ఎస్‌ఈసీ.. నాని విషయంలోనూ మరింత సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు. నాని మీడియాతో మరోసారి చేసిన వ్యాఖ్యలతో ఆయనపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఎస్ఈసీని బెదరించారనే అంశంపై కొడాలిపై కేసులు పెట్టాలని కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు. Also Read: వైసీపీకి పంచాయతీ పట్టం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద నానిపై ఐపీసీ సెక్షన్ 504, […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 13, 2021 / 04:21 PM IST
    Follow us on


    ఏపీలో ఇప్పుడు మంత్రి కొడాలి నాని.. వర్సెస్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మధ్య వార్‌‌ నడుస్తోంది. ముందే ప్రభుత్వంపై సీరియస్‌గా వ్యవహరిస్తున్న ఎస్‌ఈసీ.. నాని విషయంలోనూ మరింత సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు. నాని మీడియాతో మరోసారి చేసిన వ్యాఖ్యలతో ఆయనపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఎస్ఈసీని బెదరించారనే అంశంపై కొడాలిపై కేసులు పెట్టాలని కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు.

    Also Read: వైసీపీకి పంచాయతీ పట్టం

    ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద నానిపై ఐపీసీ సెక్షన్ 504, 505(1) (c), 506 కేసు నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు క్లాజ్‌-1, క్లాజ్‌-4 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. మంత్రి నానిపై ఎస్ఈసీ తాజాగా జారీ చేశారని ఆదేశాలు సంచలనంగా మారాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌కు మంత్రి కొడాలి నాని శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్ కారణమైందని చెప్పాలి.

    మంత్రి కొడాలి నాని శుక్రవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఎస్ఈసీని టార్గెట్ చేశారని.. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా, ఎన్నికల సంఘం ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. శుక్రవారం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మంత్రి తన న్యాయవాది చిరంజీవి ద్వారా ఎస్‌ఈసీకి బదులిచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని.. తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాల విషయంలో ప్రతిపక్ష పార్టీ అరాచకాల్ని బయటపెట్టే క్రమంలో ప్రెస్ మీట్ పెట్టినల్లు చెప్పారు. రాజ్యాంగబద్ధ సంస్థల పట్ల తనకు గౌరవం ఉందని.. ప్రత్యేకించి ఎన్నికల కమిషన్‌ను గౌరవిస్తాను అన్నారు. షోకాజ్‌ నోటీసు ఉపసంహరించుకోవాలని కోరారు.

    Also Read: ఆలూ లేదు చూలూ లేదు.. అప్పుడే మంత్రి పదవులు పంచుకుంటున్నారు

    మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని ఎస్ఈసీ చర్యలు తీసుకుంటూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి మీడియాతో మాట్లాడరాదని ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21 (నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే) వరకు మంత్రి మీడియాతో మాట్లాడకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటివరకు ఎటువంటి సభలు, సమావేశాల్లోనూ మాట్లాడకూడదన్నారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకొస్తాయని.. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, విజయవాడ పోలీస్‌ కమిషనర్లు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పుడు తాజాగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్