Telangana: తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారా.. ప్రస్తుత గవర్నర్ ఎటు వెళ్తున్నారు.. సడెన్‌గా గవర్నర్ మార్పు వార్తలు ఎందుకు వైరల్ అవుతున్నాయి.. ఇందులో వాస్తవం ఎంత అంటే నిజమే అంటున్నారు బీజేపీ వర్గాలు. మరో మూడు నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగబోతున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. తిరిగి పాలిటిక్స్‌లో యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్ పదవి నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయానిఇ్న కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రాజ్యాంగబద్ధ పదవి నుంచి తప్పుకోనున్నారని తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీల సన్నద్ధం..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. షెడ్యూల్æ కంటే ముందే ఎన్నికలు రావొచ్చేనే అభిప్రాయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని పార్టీల నేతలు గ్రౌండ్ వర్క్ స్టార్ చేశారు. ఇప్పటికే తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈనెల 28న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణలో బీజేపీ 10 సీట్లు టార్గెట్ పెట్టుకోగా.. అందుకు అనుగుణంగా అమిత్ షా నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఎన్నికల బరిలో గవర్నర్..
ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త పొలిటికల్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 26న ఆమె ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది. ఈ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. తన ఎంపీ అభ్యర్థిత్వంపై ఆమె అమిత్ షాను కోరనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని సౌత్ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తమిళిసై గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తూకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవి చూశారు. మూడుసార్లు అసెంబ్లీకి కూడా పోటీ చేశారు. కానీ ఏ ఎన్నికల్లో ఆమె గెలవలేదు. పార్టీకీ ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో తమిళిసైని తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
రాజ్యాంగ పదవి నుంచి రాజకీయాల్లోకి..
రాజ్యాంగబద్ధమైన పదవిని వదిలి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తమిళిసై భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో లోక్ సభకు పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేసేందుకు తమిళిసైకి ప్రధాని మోదీ, అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే నెలలో రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ను కేంద్రం నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. జనవరిలో రాష్ట్ర గవర్నర్ మార్పు ఖాయమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరిని గవర్నర్‌గా నియమిస్తారనేది చర్చనీయాంశమైంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: New governor for telangana thats the reason
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com