spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Women's Commission : ఏపీ మహిళా కమిషన్ ను 18 ప్రశ్నల ట్వీట్స్ తో...

AP Women’s Commission : ఏపీ మహిళా కమిషన్ ను 18 ప్రశ్నల ట్వీట్స్ తో ఉతికి అరేస్తున్న నెటిజన్లు

AP Women’s Commission మహిళా కమిషన్‌ అంటే మహిళలకు అన్యాయం జరిగినప్పుడు.. మహిళలను కించపర్చేలా ఎవరైనా మాట్లాడినప్పుడు, మహిళల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు బాధితులకు రక్షణ కల్పించాలి. హక్కులను కాపాడాలి.. న్యాయ సహాయం అందించాలి.. ఇందుకు బాధ్యులైనవారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఏ రాష్ట్రంలోనైనా మహిళా కమిషన్‌ చేయాల్సింది ఇదే. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మహిళా కమిషన్‌ ఇందుకు భిన్నం వ్యవహరిస్తోంది. రాజకీయ ప్రేరేపితంగా పనిచేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ కేవలం ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. స్వతంత్రంగా పనిచేయాల్సిన చైర్‌పర్సన్‌ అధికార పార్టీకి కొమ్ముకాస్తూ, అధికార పార్టీ నేతలను ప్రభుత్వాలను విమర్శించేవారికి నోటీసులు ఇవ్వడమే ఇందుకు కారణం. అధికార పార్టీ నేతలు మహిళలను కించపర్చినప్పుడు, మహిళల హక్కులకు భంగం కలిగించినప్పుడు మౌనం వహించడం, విపక్షాలు మాట్లాడినప్పుడు చర్యలకు దిగడం రాజకీయ ప్రేరేపితంగా పనిచేస్తుందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ మహిళా కమిషన్ ను 18 ప్రశ్నల ట్వీట్స్ తో నెటిజన్లు ఉతికి అరేస్తున్నారు. ఆ ప్రశ్నలేంటన్నవి తెలుసుకుందాం..

1. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విజయవాడ నగరంలో 23 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? ఏం చేసింది ?

2. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో 32 ఏళ్ల మహిళ ఇంట్లో అనుమానాస్పదంగా హత్యకు గురైంది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

3. మే 2022లో, బాపట్ల జిల్లాలోని రేపల్లె రైల్వే స్టేషన్‌లో 25 ఏళ్ల గర్భిణిపై దాడి చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

4. అత్యాచారం చేసేందుకు రాలేదు… దొంగతనం కోసం వచ్చి ఆపైన అత్యాచారం చేశారు అని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మృగాళ్లకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

5. అత్యాచారాలకు తల్లి పెంపకమే లోపం అని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన మహిళా లోకాన్ని, మాతృమూర్తులను అవమానించడం కాదా? ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

6. మే 2022లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి అయిన 26 ఏళ్ల యువతిపై లైంగిక దాడి జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

7. 2021లో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య 25% పైగా పెరిగిందని రాష్ట్ర పోలీసులు డిసెంబర్ 28, 2021న వెల్లడించారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

8. 2021 ఆగస్టులో గుంటూరులో 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై పట్టపగలు దుండగుడు దాడి చేసి కడుపుపై ఆరుసార్లు కత్తితో పొడిచాడు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

9. 2021లో మహిళలపై నేరాలకు సంబంధించి 17736 కేసులు నమోదయ్యాయి. రిపోర్టు చేయని మరియు నమోదు కాని కేసులను కలుపుకొంటె సంఖ్య చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

10. మే 2022లో సీఎం సొంత జిల్లా కడప ప్రొద్దుటూరులో దళిత మైనర్ బాలికపై సుమారు ఏడాది పాటు అత్యాచారం జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

11. జూన్ 2021లో సీఎం నివసిస్తున్న తాడేపల్లి దెగ్గరలో మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు పాల్పడ్డవారిలో ఒక వ్యక్తి ఇప్పటికీ దొరకలేదు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

12. సుగాలి ప్రీతికి న్యాయం చేయలేరు. సీబీఐకి కేసు ఇస్తున్నామన్నారు. ఎంత వరకు వచ్చింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

13. రెండు మూడు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి, వాటికే గోల చేయాలా అంటూ ఎదురు ప్రశ్న వేస్తారు మరో మహిళా మంత్రి గారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

14. ఎంపీ హోదాలో ఉంటూ అసభ్యకరమైన వీడియో కాల్‌లో దొరికిపోతే నైతిక బాధ్యత మర్చిపోయిన ఆ ఎంపీని వెనకేసుకొస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

15. వైసీపీ పార్టీలో మహిళలతో అసభ్యకరంగా మాట్లాడితే మంత్రి పదవి ఇస్తారు. ఇంకేం చేసుద్ది.. ఒక గంట వచ్చి వెళ్లిపో లాంటి మాటలతో మహిళలను లొంగదీసుకొనే పనులు చేస్తారు వైసీపీ ప్రజా ప్రతినిధులు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

16. సంవత్సరాలపాటు ప్రెస్ మీట్లు పెట్టి మహిళలను తక్కువ చేసి మాట్లాడతారు వైసీపీ లో మంత్రులు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

17. గుడివాడలో సంక్రాంతి సంబరాల పేరుతో చీర్ గాళ్స్ ను ఏర్పాటు చేసి రాష్ట్ర మంత్రి అండతో క్యాసినోలు నడిపారు. ఇక్కడ చీర్ గాళ్స్ ను భోగ వస్తువుగా చూపించలేదా? ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

18. నీయమ్మ మొగుడు, లం*తనం, లం…కొడుకు లాంటి మాటలు యధేచ్చగా మాట్లాడతారు వైసీపీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు. ఈ తిట్ల ద్వారా స్త్రీలను కించపరచడం లేదా? ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Oktelugu Epaper
Exit mobile version