https://oktelugu.com/

కిమ్ జాంగ్ ఉన్ ద‌గ్గ‌ర‌.. 2000 మంది సెక్స్ బానిస‌లు!

‘కిమ్ జాంగ్ ఉన్‌.. ’ ఈ నార్త్ కొరియా అధ్య‌క్షుడి గురించి చాలా మందికి తెలుసు. ఇత‌నో న‌ర‌రూప రాక్షుడు. ఆయుధాల‌తో సావాసం చేసే ఈ నియంత‌.. ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా అంత‌మొందిస్తాడ‌ని కూడా తెలుసు. ఉత్త‌ర కొరియాకు.. బాహ్య ప్ర‌పంచంతో సంబంధాలు లేకుండా చేసి, అరాచ‌క పాల‌న సాగిస్తున్నాడ‌నీ అవ‌గాహ‌న ఉంది. కానీ.. ఇదంతా నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. కిమ్ దారుణాల్లో అత్యంత కీల‌క‌మైన విష‌యం మ‌రొకటి ఉంది. అదే.. సెక్స్ బానిసత్వం త‌న […]

Written By:
  • Rocky
  • , Updated On : March 2, 2021 / 04:25 PM IST
    Follow us on


    ‘కిమ్ జాంగ్ ఉన్‌.. ’ ఈ నార్త్ కొరియా అధ్య‌క్షుడి గురించి చాలా మందికి తెలుసు. ఇత‌నో న‌ర‌రూప రాక్షుడు. ఆయుధాల‌తో సావాసం చేసే ఈ నియంత‌.. ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా అంత‌మొందిస్తాడ‌ని కూడా తెలుసు. ఉత్త‌ర కొరియాకు.. బాహ్య ప్ర‌పంచంతో సంబంధాలు లేకుండా చేసి, అరాచ‌క పాల‌న సాగిస్తున్నాడ‌నీ అవ‌గాహ‌న ఉంది. కానీ.. ఇదంతా నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. కిమ్ దారుణాల్లో అత్యంత కీల‌క‌మైన విష‌యం మ‌రొకటి ఉంది. అదే.. సెక్స్ బానిసత్వం త‌న లైంగిక వాంఛ‌ల‌ను తీర్చే వారితో ఓ సామ్రాజ్యాన్నే నెల‌కొల్పిన నియంత‌.. ఇప్పుడు ప్ర‌పంచాన్నే నివ్వెర ప‌రుస్తున్నాడు.

    Also Read: ఆసియాలోనే తొలి వ్యక్తి మన విరాట్ కోహ్లీ

    కిమ్ కు రెండు విష‌యాలంటే చాలా ఇష్ట‌మ‌ట‌. ఒకటి వెప‌న్‌. రెండు ఉమెన్‌. అందుకే.. అంత‌ర్జాతీయ ఒప్పందాల‌ను కూడా తుంగ‌లో తొక్కేసి, అణ్వాయుధాన్ని త‌న అమ్ముల పొదిలో పెట్టుకున్నాడు కిమ్‌. ఇక త‌న రెండో కోరికైన అందాన్ని ఆస్వాదించ‌డానికి ఓ పెద్ద వ్య‌వ‌స్థ‌నే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్య‌వ‌స్థ పేరే ‘కిమ్ ప్లెజ‌ర్ స్క్వాడ్’. ఇందులో కిమ్ కు అన్నివిధాలా న‌చ్చిన అమ్మాయిలు ఉంటారు. వారిలో ఎప్పుడు, ఎవ‌రు కావాలంటే వారు వ‌చ్చి, ఈ అధ్య‌క్షుడిని సుఖ‌పెడుతుంటారు.

    కిమ్ ప్లెజర్‌ స్క్వాడ్ నిర్వ‌హ‌ణ‌కు ఓ విభాగ‌మే ఉందంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. ఇందులో ప్ర‌త్యేక‌మైన అధికారులు ప‌నిచేస్తుంటారట‌. వీరి ప‌ని ఏమంటే.. దేశంలో ఉన్న అంద‌మైన‌ అమ్మాయిల‌ను వెతికి, ప్లెజ‌ర్ స్క్వాడ్ లోకి తీసుకురావ‌డం. అయితే.. అమ్మాయిలంటే ఎవ‌రు ప‌డితే వారు కాదు. కేవ‌లం టీనేజ‌ర్స్‌. 13 నుంచి 15 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సున్న అమ్మాయిలను ఏరికోరి ఎంచుకొని కిమ్ సెక్స్ సామ్రాజ్యానికి త‌ర‌లిస్తార‌ట‌!

    మ‌రి, వీరిని ఎలా వెతుకుతార‌నే క‌దా సందేహం..? చాలా సింపుల్.. టీనేజర్ అంటే పాఠశాల స్థాయి వారే కదా.. అందుకే దేశంలోని పాఠశాలలను ఈ ప్లెజర్ స్క్వాడ్ బృందం జల్లెడ ప‌డుతుంది. అందులోంచి కిమ్ కు స‌రిపోయే వారిని ఎంచుకుంటారు. కిమ్ కు న‌చ్చేవారిని, వీళ్లు ఎలా గుర్తిస్తార‌నే అనుమానం వ‌ద్దు. వారికి ఆ విధంగా ముందే శిక్ష‌ణ ఉంటుంది. దీని ప్ర‌కారం.. కిమ్ కు గుండ్ర‌టి ముఖ వ‌ర్చ‌స్సు ఉన్న‌వారు చాలా ఇష్ట‌మ‌ట‌. ఇంకా ప‌లుర‌కాల కొల‌తల ప్ర‌కారం అమ్మాయిల‌ను ఎంపిక చేసి, కిమ్ ప్లెజ‌ర్ స్క్వాడ్ కు ప‌ట్టుకుపోతార‌ట‌. ఇలా.. ఇప్ప‌టి వ‌ర‌కూ త‌ర‌లించిన వారి సంఖ్య ఎంతో తెలిస్తే.. నోరెళ్ల బెట్ట‌డం ఖాయం. దాదాపు 2 వేల మందికి పైగానే కిమ్ సెక్స్ బానిస‌లుగా ఉన్నార‌ని స‌మాచారం!

    Also Read: కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే.. వాహనదారులకు ఊరటే

    ఈ జాఢ్యం కిమ్ కు మాత్ర‌మే కాదు.. అత‌ని తండ్రి కిమ్ జాంగ్ ఇల్‌, తాత‌ కిమ్ టూ స‌న్ కు కూడా ఉంద‌ట‌. వీరు కూడా ఇలాంటి బ్యాచ్ ల‌ను మెయింటెయిన్ చేసేవార‌ట‌. వీరే కాదు.. గ‌తంలోనూ ప్ర‌పంచ నియంత‌లుగా పేరుగాంచిన వారు కూడా ఈ విధంగా సెక్స్ బానిస‌ల‌ను త‌మ సామ్రాజ్యంలో ఉంచుకునే వారు. కానీ.. కిమ్ స్థాయిలో 2 వేల మందిని ఎవ‌రూ సెక్స్ బానిస‌లుగా మార్చ‌లేదని అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు చెబుతున్నాయి.

    దేశంలో అప‌రిమిత అధికారం క‌లిగిన కిమ్ 2011 నుంచి అధికారంలో ఉన్నాడు. ఆయ‌న తండ్రి కిమ్‌జాంగ్ ఇల్ చ‌నిపోయిన త‌ర్వాత అధికారానికి వ‌చ్చిన కిమ్‌.. ఇప్ప‌టి వ‌ర‌కూ నిరాట‌కంగా త‌న పాల‌న సాగిస్తున్నాడు. నియంతృత్వ పాల‌న సాగిస్తున్న కిమ్‌.. ఏది కోరుకుంటే అది ద‌క్కితీరాల్సిందేన‌ని స‌మాచారం. కాద‌ని, ఎవ‌రైనా ఎదురు తిరిగితే.. వారికి మ‌ర‌ణ దండ‌నే అనే ప‌లు క‌థ‌నాలు వెలువ‌డిన విష‌యం తెలిసిందే.

    ప్ర‌స్తుతం కిమ్ భార్య‌గా ఉన్న‌ రీసోల్ జూ కూడా ఈ ప్లెజ‌ర్ స్క్వాడ్ నుంచి వ‌చ్చిన యువ‌తేన‌ట‌. ఆమె అందానికి ముగ్ధుడైన కిమ్‌.. ఆమెను భార్య‌గా చేసుకున్నాడ‌ని అంటారు. ఈ విధంగా.. త‌న కామ వాంఛ‌ను తీర్చుకోవ‌డానికి వేలాది మంది అమ్మాయిల జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నాడ‌నే ప్ర‌చారం సాగుతోంది. ఈ విధంగా.. అటు నియంత పాల‌న సాగిస్తున్న కిమ్‌.. ఇటు లైంగిక బానిస‌త్వాన్ని కూడా కొన‌సాగిస్తున్నాడ‌న్న విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు