https://oktelugu.com/

సీబీఐకి నయీం కేసు.. రాజకీయనేతల్లో వణుకు..?

అప్పట్లో సంచలనం సృష్టించిన మోస్ట్ వాంటెడ్ నయీం హత్యకేసు మరోసారి తెరపైకి వస్తోంది. చాలా వరకు రాజకీయ కోణంలోనే ముందుకు సాగుతున్న ఈ కేసు దర్యాప్తులో మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నయీం కేసు సీబీఐకి వెళ్లేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నయీం కేసును సీబీఐకి ఇస్తారా..? అంటూ.. కేంద్ర హోంశాఖ నుంచి తెలంగాణ సర్కారుకు లేఖ వచ్చింది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇస్తే.. పరిస్థితిని బట్టి విచారణ జరుపుతుంటారు. లేకుంటే కోర్టు ఆదేశాల ప్రకారం.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 9, 2021 / 01:41 PM IST
    Follow us on


    అప్పట్లో సంచలనం సృష్టించిన మోస్ట్ వాంటెడ్ నయీం హత్యకేసు మరోసారి తెరపైకి వస్తోంది. చాలా వరకు రాజకీయ కోణంలోనే ముందుకు సాగుతున్న ఈ కేసు దర్యాప్తులో మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నయీం కేసు సీబీఐకి వెళ్లేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నయీం కేసును సీబీఐకి ఇస్తారా..? అంటూ.. కేంద్ర హోంశాఖ నుంచి తెలంగాణ సర్కారుకు లేఖ వచ్చింది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇస్తే.. పరిస్థితిని బట్టి విచారణ జరుపుతుంటారు. లేకుంటే కోర్టు ఆదేశాల ప్రకారం.. సీబీఐ విచారణ జరుగుతుంది. అంతేకానీ.. రాష్ట్రాల విషయంలో సీబీఐ ప్రత్యేకంగా జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే.. కోర్టు ఆదేశాలు ఇవ్వాలి.. నయీం కేసులో ఈ రెండూ జరగలేదు.

    Also Read: వైసీపీని టార్గెట్ చేసిన రిపబ్లిక్ టీవీ ఆర్నబ్..?

    ఫోరంఫర్ బెటర్ గవర్నెన్స్ సంస్థ కేంద్రానికి లేఖ రాసింది. ఆ లేఖ ఆధారంగా నయీం కేసును సీబీఐకి ఇవ్వాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. నయీం కేసు విషయంలో సంచలన విషయాలు మొదట్లో వెలుగులోకి వచ్చాయి. నయీంను ఎన్ కౌంటర్ చేసిన తరువాత వేలకోట్ల ఆస్తులు గుర్తించినట్లు సమాచారం బయటకు వచ్చింది. బస్తాలకొద్ది నగదు.. వందల్లో ఆస్తి డాక్యుమెంట్లు.. అంటూ జరిగిన ప్రచారం అంతా ఇంతకాదు. అనేకమంది నేతల ప్రమేయంపైనా ఆరోపణలు చాలానే వచ్చాయి. తరువాత ఏం జరిగిందో తెలియదు. అంతా సైలెంట్ అయ్యిపోయింది. నయీం దందాలు చేసని ఆస్తులు ఏమయ్యాయో.. ఎవరికీ తెలియదు. నయీం ఇంట్లో దొరికిన సొమ్ముకూడా లక్షల్లోనే ఉందని చెబుతున్నారు.

    నయీంతో సంబంధాలు ఉన్నాయని కొంతమంది పోలీసు అధికారులను అప్పట్లో సస్పెండ్ చేశారు. తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. నేతలలెవరికీ కేసు విషయంలో సంబంధం లేదని ప్రభుత్వం తేల్చేసింది. ఈ క్రమంలో సీబీఐ విచారణ అంశం ప్రస్తావనకు రావడం ఆసక్తి రేపుతోంది. నయీం కేసులో విచారణ జరపడానికి కేంద్ర హోంశాఖ ఆసక్తి చూపడం..టీఆర్ఎస్ వర్గాల్లోనూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.టీఆర్ఎస్ ను ఇబ్బందిపెట్టే విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాజకీయంగా బలపడాలన్న చోట్ల ముందుగా కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపుతారు. అధికార పార్టీ నేతల ఆర్థిక అవకతవకలపై గిరి పెడుతుంటారు.

    Also Read: మోదీ ఆలోచన.. కేసీఆర్ ఆచరణ

    చివరికి వారందరినీ.. పార్టీ మారేలా ఒత్తడిచేస్తారు. బెంగాల్ సహా అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే.. నయీం కేసు విషయంలోనే అనేక మంది నేతలకు సబంధం ఉండడంతో వీరందరినీ టార్గెట్ చేసిన బీజేపీ సీబీఐ ద్వారా ప్రయత్నాలు చేస్తోందని గులాబీ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సర్కారు నయీం కేసును సీబీఐకి ఇవ్వడానికి ఎలాగూ ఒప్పుకోదు. అయితే ఫోరంఫర్ గవర్నెన్స్ ద్వరానే హైకోర్టులో పిటిషన్ వేయించినా.. ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాస్త అటూ ఇటు అయినా.. నయీం కేసులో సీబీఐ విచారణ ప్రారంభం కావొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్