https://oktelugu.com/

KCR Politics : జాతీయ పార్టీకి దసరా ముహూర్తం.. అసలు కేసీఆర్ ప్లాన్ ఏంటి?

KCR Politics కేసీఆర్ తెలంగాణలోంచి వెళ్లిపోవాలి.. అర్జంటుగా ఢిల్లీలో వాలిపోవాలి.. దేశ రాజకీయాలను ఏలేయాలి.. ఇప్పుడు ఇదే గులాబీ దండు మొదలుపెట్టిన అతిపెద్ద ప్రచారం.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ సోషల్ మీడియాలో ఆ పార్టీ క్యాడర్ హోరెత్తిస్తోంది. టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులంతా కేసీఆర్ హైదరాబాద్ విడిచి ఢిల్లీ వెళ్లిపోవాలిన డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే చాలా ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్ నిజామాబాద్ వేదికగా ‘జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే మీ ఆశీర్వాదం’ కావాలంటూ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 10, 2022 / 09:48 AM IST
    Follow us on

    KCR Politics కేసీఆర్ తెలంగాణలోంచి వెళ్లిపోవాలి.. అర్జంటుగా ఢిల్లీలో వాలిపోవాలి.. దేశ రాజకీయాలను ఏలేయాలి.. ఇప్పుడు ఇదే గులాబీ దండు మొదలుపెట్టిన అతిపెద్ద ప్రచారం.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ సోషల్ మీడియాలో ఆ పార్టీ క్యాడర్ హోరెత్తిస్తోంది. టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులంతా కేసీఆర్ హైదరాబాద్ విడిచి ఢిల్లీ వెళ్లిపోవాలిన డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే చాలా ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్ నిజామాబాద్ వేదికగా ‘జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే మీ ఆశీర్వాదం’ కావాలంటూ ఇలా అన్నారో లేదో అప్పుడే గులాబీ దండు రంగంలోకి దిగడం వెనుక వ్యూహాత్మక రాజకీయం ఉందంటున్నారు.

    కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని పార్టీ మొత్తం కోరుతోందని.. కేసీఆర్ ఢిల్లీలో ఏలితే.. రాష్ట్రాన్ని కేటీఆర్ ఏలడానికి ఇదంతా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. తన వారసుడిని ప్రొజెక్ట్ చేయడంతోపాటు జాతీయ స్థాయిలో మోడీకి ప్రత్యామ్మాయంగా ఎదిగేందుకు కేసీఆర్ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఎలాగైతే అధికారంలోకి వచ్చానో అలాగే కేంద్రంలో కూడా బీజేపీకి మెజార్టీ తగ్గితే పొత్తులతోనైనా ప్రభుత్వం ఏర్పాటు చేసి కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ యోచిస్తున్నారు.

    టీఆర్ఎస్ లో ఏది చేసినా పక్కా ప్రణాళికతో క్షేత్రస్థాయి నుంచి దాన్ని అమలు చేస్తుంటారు. దీన్ని పతాకస్థాయికి తీసుకెళుతారు. వైరల్, ట్రెండింగ్ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన కూడా అలాంటిదే.. ఈ దసరాకు కొత్త పార్టీని ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించారు కాబట్టి ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభమైందని చెబుతున్నారు.

    జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కోరుతున్నాయని కేసీఆర్ ఇటీవల చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు పార్టీ కూడా డిమాండ్ చేస్తుందని చెప్పుకునే అవకాశం కేసీఆర్ వ్యూహాత్మకంగా తీసుకొస్తున్నాడు.

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల కంటే ఆరు నెలల ముందే జరుగుతాయి. కాబట్టి కేసీఆర్ ముందుగా తెలంగాణలో గెలుపు కోసం అహర్నిషలు పాటుపడుతారు. తెలంగాణలో తిమ్మిని బమ్మిని చేసి అయినా గెలుపు కోసం కృషి చేస్తారు. ఇక్కడ గెలిస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాల రంగ ప్రవేశం జరిగినట్టే. ఒకవేళ ఓడిపోతే మాత్రం చంద్రబాబులా కనుమరుగు కావడం ఖాయం. అది తేల్చాల్సింది తెలంగాణ ప్రజలే. వారి చేతుల్లోనే కేసీఆర్ భవిష్యత్ ఉంది. అందుకే తెలంగాణ ప్రజలు బలపరిస్తేనే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని.. మళ్లీ బలపరిస్తే దేశాన్ని తెలంగాణలా బాగు చేస్తానని చెబుతున్నారు.

    ఈ క్రమంలోనే దసరాకు జాతీయ పార్టీకి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే గులాబీ దండు ఆ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. దూసరాకు పార్టీ ప్రకటించాక ఇతర రాష్ట్రాల్లోనూ కేసీఆర్ విస్తృతంగా పర్యటిస్తారు. సీఎంగా ఉంటూనే జాతీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన చేయబోతున్నట్టు తెలుస్తోంది.