https://oktelugu.com/

BJP vs TRS: కేంద్రంపై జాతీయ ఉద్యమం.. టీఆర్ఎస్ మరో సంచలనానికి రెడీ అవుతోందా?

BJP vs TRS: కేంద్రంపై మరో ఉద్యమానికి టీఆర్ఎస్ రెడీ అవుతోంది. అది తెలంగాణ ఉద్యమాన్ని మించి ఉండబోతోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రస్తుతం చేనేత శాఖ మంత్రి కేటీఆరే.. ఆయన పోటీచేసి గెలిచిన సిరిసిల్ల నియోజకవర్గం చేనేత కార్మికులకు అడ్డా. అలాంటి నియోజకవర్గంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా చేనేతల కడుపుకొట్టేలా కేంద్రం తాజాగా వస్త్ర పరిశ్రమపై అదనపు జీఎస్టీ ప్రతిపాదనలు చేసింది. దీంతో అందరికంటే ఎఫెక్ట్ పడేది చేనేతలపై.. పైగా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 30, 2021 / 08:38 PM IST
    Follow us on

    BJP vs TRS: కేంద్రంపై మరో ఉద్యమానికి టీఆర్ఎస్ రెడీ అవుతోంది. అది తెలంగాణ ఉద్యమాన్ని మించి ఉండబోతోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రస్తుతం చేనేత శాఖ మంత్రి కేటీఆరే.. ఆయన పోటీచేసి గెలిచిన సిరిసిల్ల నియోజకవర్గం చేనేత కార్మికులకు అడ్డా. అలాంటి నియోజకవర్గంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా చేనేతల కడుపుకొట్టేలా కేంద్రం తాజాగా వస్త్ర పరిశ్రమపై అదనపు జీఎస్టీ ప్రతిపాదనలు చేసింది.

    Modi-Shah-KCR-KTR

    దీంతో అందరికంటే ఎఫెక్ట్ పడేది చేనేతలపై.. పైగా సిరిసిల్ల నేతన్నలపై.. అందుకే ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన కేటీఆర్ బరెస్ట్ అయ్యారు. వెంటనే కేంద్రంపై మరో తెలంగాణ ఉద్యమంలాగా చేస్తామంటూ సంచలన సవాల్ చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని పున: సమీక్షించుకొని.. జీఎస్టీ కౌన్సిల్ లో ఈ పన్ను పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ రాశారు.

    వస్త్రాలపై జీఎస్టీ పన్ను పెంపు వల్ల దేశంలోని వస్త్ర, చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలవుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన కోట్లాది మంది కార్మికులకు ఈ నిర్ణయం సమ్మెటపోటని.. ఇది వారి జీవితాలను పూర్తిగా దెబ్బతీస్తుందని కేటీఆర్ భావిస్తున్నారు. వస్త్ర వర్గాల నుంచి ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తమైంది. జరుగుతున్న ఆందోళనలను పరిగణలోకి తీసుకొని కేటీఆర్ ఈ మేరకు కేంద్రంతో ఫైట్ కు రెడీ అయ్యారు.

    కేంద్రం కనుక తెలంగాణలో విస్తారంగా ఉన్న చేనేతల కడుపుకొట్టేలా ఈ జీఎస్టీ పెంపు చేస్తే మాత్రం మరో ఉద్యమానికి రెడీగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలపై రైతన్నలు ఎలాగైతే తిరగబడ్డారో.. అలాంటిదే దేశంలోని నేతన్నలతో కలిసి తాము చేస్తామని కేటీఆర్ హెచ్చరించడం విశేషం.

    ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. కేంద్రప్రభుత్వం జీఎస్టీ పన్ను పెంపు ప్రతిపాదనను విరమించుకోకపోతే ఈ విషయంలో వస్త్ర పరిశ్రమ పారిశ్రామికవర్గాలకు.. దేశంలోని నేతన్నలకు తెలంగాణ తరుఫున అండగా ఉంటామని కేటీఆర్ సంచలనానికి తెరతీశారు. దీన్ని బట్టి కేంద్రంతో మరో భారీ ఫైట్ కు టీఆర్ఎస్ రెడీ అవుతున్నట్టే లెక్క.