నరేంద్రమోడీ స్టేడియం పేరు మార్చాలట?

ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం దేశంలో హాట్ టాపిక్ గా మారింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘రాజీవ్ ఖేల్ రత్న’ పేరు మార్చడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’ దీన్ని మార్చడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాపురస్కారానికి ఒక క్రీడాకారుడి పేరు పెట్టడం సముచితమని అంటున్నారు. ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు భిన్నాభియాలు వ్యక్తం చేస్తున్నారు. మోడీని అభిమానించే వారు ఇకపై […]

Written By: NARESH, Updated On : August 6, 2021 6:09 pm
Follow us on

ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం దేశంలో హాట్ టాపిక్ గా మారింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘రాజీవ్ ఖేల్ రత్న’ పేరు మార్చడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’ దీన్ని మార్చడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాపురస్కారానికి ఒక క్రీడాకారుడి పేరు పెట్టడం సముచితమని అంటున్నారు.

ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు భిన్నాభియాలు వ్యక్తం చేస్తున్నారు. మోడీని అభిమానించే వారు ఇకపై క్రీడా పురస్కారాలన్నింటికి రాజకీయ నేతల పేర్లు కాకుండా క్రీడాకారుల పేర్లే పెట్టాలని సూచిస్తున్నారు.

ఇక టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పటాన్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ‘ఈ మార్పును స్వాగతిస్తున్నామని.. క్రీడాకారుల పేర్ల మీద పురస్కారాలు అందిస్తే వారికి గుర్తింపు లభిస్తుందని.. భవిష్యత్తులో స్డేడియం పేర్లకు క్రీడాకారుల పేర్లే పెడుతారని భావిస్తున్నానని అన్నారు.

మోడీ వ్యతిరేకులు మాత్రం దీనిపై ఎద్దేవా చేస్తున్నారు. గుజరాత్ ప్రతిపక్ష కాంగ్రెస్ నేత శంకర్ సిన్హ్ మాత్రం దీన్ని వ్యతిరేకించారు. ‘ఈ మార్పును ఖచ్చితంగా స్వాగతిస్తానని.. కానీ గుజరాత్ లోని నరేంద్రమోడీ స్టేడియంకు తిరిగి సర్ధార్ పటేల్ స్టేడియంగా మార్చాల్సిందిగా కోరుతున్నా’ అంటూ ట్వీట్ చేశారు.

టీపీసీసీ అధ్యక్షులు ఎం.పీ శ్రీ రేవంత్ రెడ్డి కూడా మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రాజీవ్ ఖేల్ రత్న అవార్డును పేరు మార్చి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా నామకరణం చేయడం దారుణమన్నారు. ఇది బీజేపీ, మోడీ పాలకుల సంకుచిత బుద్ధికి నిదర్శనమన్నారు. యువకులను అన్ని రంగాలలో ప్రోత్సహించి దేశంలో క్రీడా అభివృద్ధికి ఎంతో కృషి చేసిన స్వర్గీయ భారత రత్న రాజీవ్ గాంధీ పేరు ను ఖేల్ రత్న గా ఉండడం సముచితమన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మార్చుకొని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కొనసాగించాలన్నారు. రాజీవ్ గాంధీ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని మోడీ తీరును రేవంత్ రెడ్డి ఎండగట్టారు.

ఈ చర్చ కేవలం ప్రముఖులతో ఆగిపోలేదు.. రాజీవ్ ఖేల్ రత్న పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చి మోడీ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. నరేంద్రమోడీ స్టేడియం, జైట్లీ స్టేడియం పేర్ల వాటి స్థానంలో క్రీడాకారుల పేర్లు పెట్టాలి. రాజకీయ నేతల పేర్లు తీసేయాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేశారు.