Narendra Modi called Putin: మోడీనా మజాకా.. రష్యాను నిలువరించి.. యుద్ధాన్ని 6 గంటలు ఆపిన ప్రధాని

Narendra Modi called Putin: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ యుద్ధం వద్దన్నారు. బ్రిటన్ సహా యూరప్ లోని నాటో దేశాలన్నీ ఉక్రెయిన్ పై యుద్ధం వద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఒత్తిడి తెచ్చాయి. అంతేకాదు.. కఠినమైన ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తున్నారు. అన్ని వైపులా చక్ర దిగ్బంధనం చేసినా కూడా పుతిన్ వెనక్కి తగ్గలేదు. యుద్ధం ఆపలేదు. కానీ భారత ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఏకంగా ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆరుగంటల […]

Written By: NARESH, Updated On : March 3, 2022 11:51 am
Follow us on

Narendra Modi called Putin: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ యుద్ధం వద్దన్నారు. బ్రిటన్ సహా యూరప్ లోని నాటో దేశాలన్నీ ఉక్రెయిన్ పై యుద్ధం వద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఒత్తిడి తెచ్చాయి. అంతేకాదు.. కఠినమైన ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తున్నారు. అన్ని వైపులా చక్ర దిగ్బంధనం చేసినా కూడా పుతిన్ వెనక్కి తగ్గలేదు. యుద్ధం ఆపలేదు. కానీ భారత ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఏకంగా ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆరుగంటల పాటు ఆపేశారు. ప్రపంచంలోని ఏ దేశం, దేశాధినేత కూడా చేయని పనిని మోడీ చేశాడు. ఇదంతా చేసింది కేవలం భారత విద్యార్థుల కోసం.. వారి ప్రాణాలు రక్షించేందుకు.. మోడీ చేసిన పనికి ఇప్పుడు దేశ ప్రజలంతా సెల్యూట్ చేస్తున్నారు.

Putin, Narendra modi

ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒక్కో నగరాన్ని రష్యన్ సేనలు దక్కించుకుంటున్నాయి. రాజధాని కీవ్ ఇప్పటికే రష్యా ఆధీనంలోకి వచ్చింది. దక్షిణాన ఉన్న సముద్రం నుంచి కూడా దాడి చేసి దక్షిణ ఉక్రెయిన్ లోని నగరాలను కూడా రష్యన్ సైనికులు ఆక్రమించేస్తున్నారు.

ఇక అణుయుద్ధానికి పుతిన్ దిగబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం రష్యన్ సేనలు యుద్ధం చేస్తున్న ఖర్కివ్ ను ఖాళీ చేయాలని భారత రాయబార కార్యాలయం పిలుపునిచ్చింది. అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. ఖార్కివ్ నుంచి వెళ్లిపోవాలని.. అక్కడి పరిస్థితులు క్షీణించాయని పేర్కొంది. వాహనాలు దొరక్కపోతే కాలినడకన అయినా ఆ నగరం నుంచి పెసోచిన్, బాబే, బెజ్లిడోవ్కా నగరాలకు తక్షణమే తరలిపోవాలని సూచించింది.

ఖార్కివ్ లో పెద్ద ఎత్తున భారత విద్యార్థులు చిక్కుకుపోయారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు భారత ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేశారు. భారత విద్యార్థులను రష్యా మీదుగా తరలించాలని కోరారు. భారతీయ విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.

Also Read: PMMVY: కేంద్రం సూపర్ స్కీమ్.. అమ్మాయి పుడితే రెండో కాన్పులో డబ్బులు పొందే ఛాన్స్!

మోడీ ఫోన్ కాల్ కు స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. భారతీయ విద్యార్థులకు సేఫ్ ప్యాసేజ్ ప్రకటించారు. తరలించేందుకు వీలుగా ఖార్కివ్ పై దాడులను ఏకంగా 6 గంటల పాటు నిలిపివేయాలని రష్యా సైనికులను ఆదేశించారు. భారతీయులు 6 గంటల్లోగా ఖార్కివ్ ను విడిచి వెళ్లాలని ఆదేశించారు.

ప్రపంచమంతా ఎవరూ కోరినా స్పందించని రష్యా అధ్యక్షుడు పుతిన్.. భారత ప్రధాని నరేంద్రమోడీ ఒక్క ఫోన్ కాల్ కు స్పందించారు. ఏకంగా యుద్ధాన్ని ఆపేశారు. ఈ ఘటనతో భారత ప్రధాని ఎంత శక్తిమంతుడన్నది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసివచ్చింది. యుద్ధాన్ని ఆపిన యోధుడిగా మోడీ చరిత్రలో నిలిచిపోతాడనంలో ఎలాంటి సందేహం లేదు. రష్యాతో, పుతిన్ తో మోడీ స్నేహమే ఇప్పుడు ఇంతటి యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇవ్వడానికి కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్ -రష్యా వార్.. అభాసుపాలవుతున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్

Recommended Video: