
Nara Lokesh Troll: జనాల్లోకి వెళ్లి వారం గడుస్తున్నా లోకేష్ కి జనాన్ని ఎలా మచ్చిక చేసుకోవాలో అర్థం కావడం లేదు.. వారికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదు.. ఒక సభలో 1994 దాకా హైదరాబాదులో రాళ్లు రప్పలే ఉండేవి అంటాడు.. మా తాత వస్తే గాని వారు అన్నం తినలేదు అంటాడు. ఇంకొక సభలో హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టిందే మా నాన్న అంటాడు.. వేరొక దగ్గర ఐదు సంవత్సరాలలో 40 వేల పరిశ్రమలు, ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతాడు.. ప్రభుత్వం ఇంత కష్టపడితే, ఆ స్థాయిలో ఉద్యోగాలు ఇస్తే… 23 దగ్గరే ఎందుకు కూర్చోబెట్టారో, మంగళగిరిలో తనను ఎందుకు ఓడించారో మాత్రం చెప్పడు.
ఎస్, లోకేష్ ఫ్యూచర్ లీడర్ కావాలి అనుకుంటున్నాడు. కొత్త తరహా రాజకీయాలు అందివ్వాలి అనుకుంటున్నాడు. భేష్, ఈ నిర్ణయం మంచిదే.. కానీ ఆచరణలో ఎక్కడ? ఇవాల్టికి తనకు నోరు తిరగదు. తెలుగు స్పష్టంగా మాట్లాడలేడు. జనాలకు అర్థమయ్యేలాగా కనెక్ట్ కాలేదు. ఇలాంటి అప్పుడు తన గళం ఎంత వినిపిస్తే ఏంటి? యువ గళం పేరుతో యాత్ర చేస్తే ఏమిటి?

ఒక నాయకుడికి ఉండాల్సింది దీర్ఘ దృష్టి. అన్నింటికీ మించి జనం నాడి.. ఇవి తెలుసుకోవాలనే లోకేష్ జనంలోకి వచ్చాడు. జనంలో తిరుగుతున్నాడు. కానీ ఆ జనానికి కనెక్ట్ కాలేకపోతున్నాడు. తన తండ్రి రాయలసీమ వాసి. అప్పుడప్పుడు సీమయాసలో మాట్లాడుతాడు. కానీ అదే లోకేష్ నోటిలో సీమ యాస పలకదు. ఆ లెక్కకు వస్తే అసలు తెలుగే సరిగా పలకదు. సరే మనిషన్నాక ఏ వేవో లోపాలు ఉంటాయి.. వాటిని సరిపెట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. అసలే ఇవి సోషల్ మీడియా రోజులు. భూతద్దం పెట్టి వెతికే రోజులు. పైగా ఆ జగన్ నిఘా సరే సరి. ఇలాంటి అప్పుడు లోకేష్ ఎలా మాట్లాడాలి? ఎలాంటి వస్త్రాలను జనాలపైకి వదలాలి? కానీ అవి ఏవీ చేయడం లేదు.. పైగా తన తండ్రి లాగానే వ్యక్తిగత సోత్కర్షకు పరిమితమవుతున్నాడు.. తమ హయాంలో 40 వేల కంపెనీలు, ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నాడు.. జనాలకు అందిస్తే తెలుగుదేశం పార్టీని ఎందుకు ఓడించినట్టు? 23 సీట్లు దగ్గర ఎందుకు ఆపినట్టు… పాపం పాదయాత్ర చేస్తున్నప్పటికీ లోకేష్ కు ఫాయిదా ఏం కనిపించడం లేదు.
