
Nara Lokesh Padayatra: అచ్చం మామలా లోకేష్ ఊగిపోవడంలో అంతా అవాక్కయారు. బాలకృష్ణలాగే తొడకొట్టారు. మీసం మెలేశారు. వైసీపీ నేతలను కట్ డ్రాయర్ తో ఊరేగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే వైసీపీ నేతల తోలు తీయడం పెద్ద లేక్కేమి కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల అరాచకాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆగ్రహంతో ఊగిపోయారు.
అడుగడుగునా అడ్డంకులే…
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర 24వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం శ్రీకాళహస్తిలో కొనసాగుతుంది. యువగళం పాదయాత్రకు పోలీసులు, వైసీపీ శ్రేణులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ముందుగా అనుమతి ఇవ్వని ప్రభుత్వం, కోర్టు ఆదేశాల మేరకు ఆంక్షలతో కూడిన పాదయాత్ర చేసుకోవచ్చని సూచించింది. ఇది మింగుడు వైసీపీ ప్రభుత్వం అడ్డుకునేందుకు, అల్లరి సృష్టిస్తుూనే ఉన్నారు. అటు చంద్రబాబు కూడా కనీసం బహిరంగ సభలు కూడా పెట్టుకునేందుకు అనుమతి లేదని అనడంపై మండిపడుతున్నారు. ఇటీవల చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉండగా, బహిరంగ సభలో ప్రసగించేందుకు అనుమతి లేదని నానా యాగి చేశారు. ఏకంగా పోలీసులే వాహనాలు అడ్డుపెట్టి కదలనీయకుండా చేశారు. దీంతో ఆయన కాలినడకన వెళ్లి సభలో ప్రసంగించాల్సి వచ్చింది. ఆ సంఘటన పెద్ద దుమారమే రేగింది. లోకేష్ పాదయాత్రల వాహనాలను కూడా తిరుపతిలో స్వాధీనం చేసుకున్నారు. గన్నవరంలో పట్టాభిపై, తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ మూకలు దాడులు చేశారు.
రా చూసుకుందాం.. లోకేష్
ఈ ఘటనల నేపథ్యంలో లోకేష్ తీవ్రంగా స్పందించారు. ‘ఏం మాకు పౌరుషం లేదని అనుకుంటున్నారా?. మీసాలు తిప్పి చెబుతున్నా.. రా చూస్తా. మా ఓర్పు, సహనాన్ని పరీక్షించకండి. దాడి చేయడానికి యత్నించిన ఒక్కొక్కర్ని కట్ డ్రాయర్ మీద ఊరేగిస్తాను. దమ్ముంటే రండి నేను ఇక్కడే ఉన్నా’ అని నారా లోకేశ్ ఆవేశంతో ఊగిపోయారు. చంద్రబాబు ఆదేశిస్తే వైసీపీ నేతల తోలు తీయడం పెద్ద విషయమేమీ కాదని స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని పెట్రేగిపోతున్నారని మండిపడ్డారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని ఒక్కొక్కరి ఒక్కొక్కరి లెక్కలు తీరుస్తానని అన్నారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటున్నామని చెప్పుకొచ్చారు.

వైసీపీకి మైలేజ్ కేసమేనా?
వైసీపీ మైలేజ్ పెంచుకోవడానికే ఒక క్రమబద్ధంగా టీడీపీ శ్రేణులపై దాడులను చేయిస్తుంది. వలంటీర్లను కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ తెలుగుదేశం సభలకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయిస్తున్నారు. ఎవరైనా వెళితే పథకాలు రావని చెప్పేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు సభలను పోలీసుల సాయంతో గందరగోళం సృష్టిస్తున్నారు. టీడీపీ నేతలను గందరగోళానికి గురిచేస్తున్నారు. అనుకున్నట్లుగానే తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. దీనిని ప్రజల్లోకి ఇంకో రకంగా తీసుకెళ్లడంలో వైసీపీ నేతలు సక్సెస్ అవుతున్నారు. అంతిమంగా అధికారంలోకి మళ్లీ వైసీపీని తీసుకువచ్చేందుకు సఫలం అవడానికి మార్గాలను సుగమం చేసుకుంటున్నారు. లోకేష్ కూడా సహనం కోల్పోయి మాట్లడటం ఇందుకు ఉదాహరణ.