
Nara Lokesh: లోకేష్ ప్రజా మద్దతు కూడగట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్న చంద్రబాబు ప్రజల్లోకి లోకేష్ ను పంపించారు. క్షేత్ర స్థాయిలో పార్టీకి మరింత జవసత్వాలు నూరిపోయడంతో పాటు, ఆయను నాయకుడిగా చూపించే ప్రయత్నానికి పాదయాత్ర ఉపకరిస్తుందని భావించారు. మరి ఆ మేరకు పనిచేస్తుందా లేదా అన్నదానిపై పోస్టుమార్టం మాత్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్రం ప్రస్తుతం తిరుపతి జిల్లాలో కొనసాగుతుంది. 31వ రోజుకు చేరుకొని 400 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. టీడీపీని బలంగా ప్రజల్లోకి తీసుకుళ్లే ప్రయత్నం లోకేష్ చేస్తున్నా, అనుకున్న స్థాయిలో లేదనే భావనలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ శాతం తనను తాను నిరూపించుకునేందుకే సమయం కేటాయిస్తున్నారన్న విమర్శలు ఎక్కువయ్యాయి.
ఎన్నికల ముందు పాదయాత్రలు చేపట్టడం కామన్ గా మారింది. గతం కంటే భిన్నంలా కాకుండా లోకేష్ పాదయాత్ర పక్కా కాపీలా అనిపిస్తుంది. ఇదో పెద్ద మైనస్. అనుకున్నదొకటి… అవుతుందొకటి అన్న రీతిలో ఉంది. క్షేత్ర స్థాయిలో డల్ గా సాగుతుంది. ఆయన చేస్తున్న ఉపన్యాసాలన్నీ.. టీడీపీ వస్తే అందరికీ మూడిద్ది అన్నట్లుగానే ఉంటున్నాయి. ప్రజలకు చేసే మేలు చెప్పకుండా ప్రభుత్వ అధికారులను, వైసీపీ నేతలను బెదిరించే విధంగా ఉంటున్నాయి.

ఈ రకమైన ప్రచారం పార్టీకి నెగటివ్ భావాలను తీసుకువస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ అంశాలను తీసుకుని అధికార పార్టీ నాయకులు లోకేష్ పై ట్రోల్స్ మొదలుపెట్టారు. లోకేష్ పాదయాత్ర తరువాత టీడీపీ కనుమరుగవడం ఖాయమని వైసీపీ నేతలు చెబుతున్నారు. స్థానిక అంశాల ప్రస్తావన అతి తక్కువగా ఉంటుంది. లోకల్ లీడర్లు తెలిపిన సమస్యలన్నింటిని పార్టీ అధికారంలోకి రాగానే తీర్చేస్తామని హామీలిచ్చుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇది టీడీపీ మేధావులు చేస్తున్న దప్పిదమా లేక లోకేష్ స్వకృతాపరాధమా అనేది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే అసలుకే మోసం వచ్చి వైసీపీ నేతలు చెబుతున్నట్లు టీడీపీ కనుమగైపోయే అవకాశం లేకపోలేదు.