Nara Lokesh: అమెరికా పోలీసుల కస్టడీలో లోకేష్.. ప్రచారంలో నిజమెంత?

Nara Lokesh: అమెరికా పోలీసుల కస్టడీలో లోకేష్.. ప్రచారంలో నిజమెంత?

Written By: Dharma, Updated On : January 25, 2024 9:38 am

Nara Lokesh:

Follow us on

Nara Lokesh: ఇటీవల నారా లోకేష్ పెద్దగా కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో సైతం లోకేష్ యాక్టివిటీస్ తగ్గాయి. ఆయన ఏమైనా విదేశీ పర్యటనలో ఉన్నారా? లేకుంటే ఎన్నికల వ్యూహాల్లో భాగంగా అంతర్గత చర్చల్లో నిమగ్నమయ్యారా? అన్నది మాత్రం తెలియడం లేదు. కానీ ఆయన యూఎస్ పర్యటనకు వెళ్లారని.. ఎన్నికలకు సంబంధించి నిధుల సమీకరణలో పడ్డారని.. ఈ క్రమంలో అక్కడి పోలీసులకు చిక్కారని సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ.. వైసీపీ శ్రేణులు మాత్రం తెగ ట్రోల్ చేస్తున్నాయి.

యువ గళం పాదయాత్ర ముగింపు తర్వాత లోకేష్ పెద్దగా కనిపించడం లేదు. అటు చంద్రబాబు ‘రా కదలి రా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రసంగిస్తున్నారు. అదే సమయంలో లోకేష్ రాజకీయ కార్యక్రమాలేవీ కనిపించడం లేదు. దీంతో ఆయన అంతర్గత చర్చలు, వ్యూహాలకు పరిమితమవుతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇటీవల పూర్తిగా కనిపించకపోయేసరికి లేనిపోని ప్రచారం ప్రారంభమైంది. యూఎస్ లో నిధుల సమీకరణలో భాగంగా.. హవాలా తరహాలో నగదును ఏపీకి తెచ్చి క్రమంలో యూఎస్ పోలీసులు లోకేష్ ను కస్టడీలోకి తీసుకున్నారని ప్రచారం ప్రారంభమైంది. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ఈ విషయాన్ని ట్రోల్ చేస్తోంది.

వచ్చే ఎన్నికలు చావోరేవో లాంటివి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య. అధికార వైసిపికి పుష్కలంగా నిధులు ఉన్నాయి. పెద్ద ఎత్తున ధనప్రవాహంతో ఆ పార్టీ గెలవాలని చూస్తుందని వార్తలు వస్తున్నాయి. వాటితో పోల్చుకుంటే ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి నిధుల సమస్య ఉంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన కమ్మ ప్రముఖులు పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే లోకేష్ యూఎస్ వెళ్లి.. అక్కడి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారని ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని టిడిపి వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట లోకేష్ ను అబాసుపాలు చేయడానికి ఈ తరహా ప్రచారం చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. లోకేష్ ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యారని.. ఇప్పటికే చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచార సభలు నిర్వహిస్తుండడంతో.. క్షేత్రస్థాయిలో నెట్వర్క్ నడుపుతున్నారని.. ఇది చూసి తట్టుకోలేక వైసీపీ ఈ తరహా ప్రచారానికి దిగిందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే ఎన్నికల ముంగిట ఇటువంటి ఫేక్ ప్రచారాలు ఎన్నెన్నో బయటకు వచ్చే అవకాశం ఉంది.