Nara Brahmani : టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు.. ఎమ్మెల్యే కం స్టార్ హీరో బాలయ్య బాబు కూతురు.. నారా లోకేష్ సతీమణికి ఇలాంటి అభిరుచి ఉందని.. ఆమెలో ఎవరికీ తెలియని ఈ గొప్ప టాలెంట్ ఉందని ఊహించలేదు. అది బయటపడేసరికి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఈ శీతాకాలంలో సైనికులు సైతం ఉండలేని చోటు హిమాయాల్లోని లఢక్, లేహ్ లు. మైనస్ డిగ్రీలు ఉండి.. మంచు కురిసే ఈ పర్వత ప్రాంతాల్లో ప్రయాణం ప్రాణాంతకం. అయితే మామూలు వ్యక్తులే అక్కడ బైక్ లు నడపలేరు. అలాంటి అస్సలు వీటితో సంబంధం లేని నారా బ్రాహ్మణి ఏకంగా హిమాలయ కొండల్లో నిర్వహించిన బైక్ రేసులో పాల్గొని ఔరా అనిపించింది. లక్ష్యం పూర్తి చేసి అందరికీ షాకిచ్చింది.

నారా బ్రాహ్మణి చాలా తక్కువగా లో ప్రొఫైల్ పాటిస్తుంది. పెద్దగా బయట కనిపించదు. వారి వ్యాపారాలు, వ్యాపకాలు అన్నట్టు ఉంటుంది. అయితే బ్రాహ్మణిలో ఎవరికీ తెలియని ట్యాలెంట్ ఉందని.. ఆమెకు బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టమని తాజాగా తేలింది.
ప్రముఖ మోటార్ కంపెనీ ‘యజ్డి’ తాజాగా లఢక్ నుంచి లేహ్ వరకూ ‘బైక్ సాహసయాత్ర’ నిర్వహించింది. అందులో బైక్ రైడర్లతో కలిసి నారా బ్రాహ్మణి పాల్గొంది. ఈ టీంలో సగం మంది మహిళలు పాల్గొన్నారు. అందులో మన బ్రాహ్మణి కూడా ఒకరు కావడం విశేషం.

మంచు కురిసే పర్వత ప్రాంతాల్లో ఏమాత్రం స్లిప్ అయినా ప్రాణాలు గల్లంతే. అంతటి క్లిష్ట వాతావరణంలో ఎవరూ సాయం కూడా చేయడానికి ఉండరు. అలాంటి వాతావరణంలో బైక్ రేసింగ్ లో పాల్గొని పూర్తి బ్రాహ్మణి సత్తా చాటింది. తాజాగా ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలోనూ పంచుకోలేదు. బైక్ కంపెనీ విడుదల చేసిన వీడియోలో బ్రాహ్మణి ఉండేసరికి అందరూ చూసి షాక్ అయ్యారు.
బ్రాహ్మణి రాజకీయ కుటుంబం కావడంతో ఇన్నాళ్లు తన అభిరుచులను ఎవరికీ తెలియనీయడం లేదు. అయితే తన ఇష్టాన్ని ఫ్యాషన్ ను మాత్రం కొనసాగిస్తోందని తెలుస్తోంది. ఆమె సాహసయాత్రకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు. బాలయ్య కడుపున ధీర వనిత పుట్టిందని మెచ్చుకుంటున్నారు.