Taraka Ratna : జీవితం ఎప్పుడు ఎవరి చేతిలో ఉండదు..ఎప్పుడు వస్తామో ఎప్పుడు వెళ్తామో మొత్తం దేవుడి దయ..అసలు ఏమాత్రం ఆరోగ్యం బాగోలేని మనుషులు వైద్యం ద్వారా కోలుకొని బాగుపడొచ్చు..సంపూర్ణ ఆరోగ్యం తో ఉన్నవాళ్ళు అకస్మాత్తుగా ప్రాణాలను కోల్పోవచ్చు..గతంలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ విషయం లో ఇదే జరిగింది..ఎప్పుడు నవ్వుతూ ఎంతో ఆరోగ్యం గా ఉండే పునీత్ అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించాడు..ఇప్పుడు నందమూరి తారకరత్న విషయం లో కూడా అదే జరిగింది.
తన బావ నారా లోకేష్ ‘యువగళం’ పేరిట ప్రారంభించిన పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు..దీనితో వెంటనే ఆయనని కుప్పం ప్రాంతం లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు..అక్కడ ఆయనని ICU లో పెట్టి ఆపరేషన్ చేసారు..పరిస్థితి ఏమాత్రం కోలుకోకపోవడం తో వెంటనే అతనిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు కి తరలించారు..అక్కడ కూడా ఆయన కోలుకోకపోవడంతో విదేశాలకు తరలించి ఆయనని స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేసారు. కానీ ఫలితం లేకుండా పోయింది.
అక్కడ ఆయనకీ కార్డియాలజీ స్పెషలిస్ట్స్ తో ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి చికిత్స అంధించారు..ఎన్నో రోజులు మృత్యువుతో పోరాడిన తారకరత్న నేడు కన్నుమూశాడు.. దీంతో నందమూరి అభిమానులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.. ఇక నందమూరి కుటుంబంలో ఎలాంటి విషాద ఛాయలు కమ్ముకొని ఉంటాయో ఊహించడానికి కూడా కష్టం గా ఉంది.
ఇప్పటికే బెంగళూరులోని నారాయణ హాస్పిటల్స్ కి నందమూరి కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు.. జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు కూడా చేరుకున్నారు.. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన తారకరత్న పెద్దగా సక్సెస్ లను చూడకపోయినప్పటికీ వ్యాపార రంగంలో గొప్పగా రాణించారు..ఆ తర్వాత ఇటీవలే కాలంలో తెలుగు దేశం పార్టీ లో అధికారికంగా జాయిన్ అయ్యాడు.. గుడివాడ నుండి పోటీ కూడా చేద్దాం అనుకున్నాడు..అలా తన రాజకీయ భవిష్యత్తుని ప్రారంభించిన తారకరత్న ఇలా అకస్మాత్తుగా మరిణించడం బాధాకరం..ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థన చేద్దాము.