https://oktelugu.com/

Nampally Court: కోర్టు తీర్పు బీజేపీకి అస్త్రంగా మారిందా?

Nampally Court: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ 2012లో హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిజామాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ కేసులో అక్బరుద్ధీన్ నెలన్నర పాటు జైలులో ఉండాల్సి వచ్చింది కూడా. దాదాపు 10ఏళ్లపాటు కొనసాగిన అక్బరుద్దీన్ కేసును నాంపల్లి కోర్టు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కొట్టివేసింది. అక్బరుద్దీన్ కు శిక్ష ఖరారు అవుతుందని అంతా భావించిన సమయంలో ఈ కేసును […]

Written By:
  • NARESH
  • , Updated On : April 14, 2022 / 10:51 AM IST
    Follow us on

    Nampally Court: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ 2012లో హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిజామాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ కేసులో అక్బరుద్ధీన్ నెలన్నర పాటు జైలులో ఉండాల్సి వచ్చింది కూడా. దాదాపు 10ఏళ్లపాటు కొనసాగిన అక్బరుద్దీన్ కేసును నాంపల్లి కోర్టు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కొట్టివేసింది.

    అక్బరుద్దీన్ కు శిక్ష ఖరారు అవుతుందని అంతా భావించిన సమయంలో ఈ కేసును నాంపల్లి కోర్టు కొట్టివేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే తీర్పు సమయంలో హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది సంబరాలు చేసుకునే సమయం కాదని మరోసారి ఇలాంటి వ్యాఖ్యలను చేయద్దని అక్బరుద్దీన్ కు కోర్టు సూచించింది. దేశ సమగ్రతను దెబ్బతీసే వ్యాఖ్యలను ఇకపై చేయద్దంటూ మందలించింది.

    ఎంఐఎంతో తొలి నుంచి కయ్యానికి కాలుదువ్వుతున్న బీజేపీ కోర్టు తీర్పును తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ కేసులో న్యాయస్థానికి పోలీసులు సరైన ఆధారాలు చూపించలేదని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎంఐఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయని, వీరిద్దరు కమ్మక్కై కేసును గార్చే ప్రయత్నం చేశారని పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది.

    కోర్టులకు కావాల్సింది సాక్ష్యాలని, అలాంటి సాక్ష్యాలను సమర్పించడంలో పోలీసులు విఫలం అయ్యారనే ప్రచారాన్ని బీజేపీకి ప్రజల్లోకి బలంగా తీసుకెళుతోంది. దీని వెనుక టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల హస్తం ఉందంటూ వాదిస్తోంది. టీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఈ కేసు విషయంలో ప్రభుత్వం అప్పీలుకు వెళ్లాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

    టీఆర్ఎస్, కాంగ్రెస్ అండతోనే ఎంఐఎం నేతలు రెచ్చిపోయి హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. తెలంగాణలో ఎవరూ అధికారంలో ఉన్నా స్టీరింగ్ తమ చేతిలో ఉంటుందని గతంలో ఎంఐఎం నేతలు మాట్లాడిన మాటలను వారంతా గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో ఎంఐఎం లాంటి హిందు వ్యతిరేక శక్తులను ఓడించేందుకు ప్రజలంతా కలిసి రావాలని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది.