వైఎస్ మరణంపై విజయమ్మ ఏమి రాసి ఉంటారు?

నేడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి,71వ జయంతి. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న కడపకు వెళ్లడం జరిగింది. నేడు ఇడుపులపాయలో గల వై యస్ సమాధిని జగన్ కుటుంబంతో పాటు సందర్శించి నివాళులు అర్పించారు. వై ఎస్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు కూర్చొని దివంగత నేతను స్మరించుకున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జులై 8ని రైతు దినోత్సవంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతు బాంధవుడిగా అనేక […]

Written By: Neelambaram, Updated On : July 8, 2020 5:28 pm
Follow us on


నేడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి,71వ జయంతి. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న కడపకు వెళ్లడం జరిగింది. నేడు ఇడుపులపాయలో గల వై యస్ సమాధిని జగన్ కుటుంబంతో పాటు సందర్శించి నివాళులు అర్పించారు. వై ఎస్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు కూర్చొని దివంగత నేతను స్మరించుకున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జులై 8ని రైతు దినోత్సవంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతు బాంధవుడిగా అనేక విప్లవాత్మ నిర్ణయాలు తీసుకొని అమలు చేసిన వై యస్ రాజశేఖర్ రెడ్డి గౌరవార్ధం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

జగన్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!

కాగా విజయమ్మ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోగ్రఫీ రాసింది. ‘నాలో నాతో వై ఎస్ ఆర్’ పేరుతో రాసిన ఈ పుస్తకంలో ఆమె ఏమి అంశాలు ప్రసావించి ఉంటారు అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో మొదలైంది. రాజకీయ నాయకుడిగా వై ఎస్ జీవితం తెరిచిన పుస్తకమే. చనిపోయే వరకు విజయపథంలో సాగిన ఆయన రాజకీయ జీవితంతో పాటు, వ్యక్తిగా, భర్తగా, తండ్రిగా ఆయన నెరవేర్చిన బాధ్యతలు ఆమె ఇందులో పొందుపరచి ఉండవచ్చు. ఇక తండ్రి రాజారెడ్డి తో వై ఎస్ కి ఉన్న అనుబంధం, డాక్టర్ గా రాజశేఖర్ రెడ్డి ప్రజలకు అందించిన సేవలు కూడా ఈ పుస్తకంలో తెలియజేసి ఉండవచ్చు.

ఆ విధంగా జగన్ పై పవన్ గెలిచాడట..!

ఐతే ఆయన జీవితంలో చివరి అంశం, ఆయన మరణం గురించి కూడా విజయమ్మ ప్రస్తావించారా లేదా అనేది అన్నింటికంటే ముఖ్యమైన విషయం. వై ఎస్ మరణం అనేది పెద్ద మిస్టరీగా ఉంది. కుట్రలో భాగంగానే సొంత పార్టీ నేతలు, కార్పొరేట్ దిగ్గజాలతో కలిసి వై ఎస్ చావుకు పథక రచన చేశారని అప్పట్లో వార్తలు రావడం జరిగింది. గత ఎన్నికల ప్రచారంలో కూడా వై ఎస్ జగన్ తన తండ్రిని కొందరు ఉద్దేశ పూర్వకంగా చంపేశారని, అది ప్రమాదం కాదని చెప్పారు. వై యస్ మృతిపై కుటుంబ సభ్యులలో అనుమానాలుండగా, విజయమ్మ ఈ విషయాలను ఆ పుస్తకంలో ప్రస్తావించారా లేదా అనేది చూడాలి. వై ఎస్ ఊపిరి వదిలిన సంఘటనను ఆమె ప్రమాదంగా రాశారా లేక కుట్రకోణంలో రాశారా అనేది ఆసక్తి కరంగా మారింది.