Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు ఎన్నికలకు వెళ్లినా తన చేతిలో అనేక ఆప్షన్లు ఉంటాయి. పొత్తు లేకుండా ఎప్పుడూ ఆయన గెలుపొందలేదు. పొత్తు పెట్టుకొని కూడా ఓడిపోయిన సందర్భాలున్నాయి.
ఏపీలోని 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన చంద్రబాబు 2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిని ఓడించి మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు రకరకాల కసరత్తులు చేస్తున్నారు.
2014లో తనను పదేళ్ల తర్వాత అధికారంలోకి తీసుకొచ్చిన జనసేన-బీజేపీతో పొత్తును పునరుద్దరించాలన్నది చంద్రబాబు ప్లాన్.ఇప్పటికే జనసేనపై తన ‘ప్రేమ’ను చంద్రబాబు చాటారు. పవన్ వైపు నుంచి దీనిపై స్పందన లేదు.
అయితే జనసేనాని పవన్ పొత్తుకు ఒప్పుకున్నా చంద్రబాబును నమ్మి మరోసారి పొత్తు పెట్టుకొని వెళ్లడానికి బీజేపీ సిద్ధంగా లేదు. బీజేపీతో పొత్తు కుదరకపోతే వామపక్షాలు, జనసేనతో కలిసి వెళ్లే ప్లాన్ బి చంద్రబాబును అమలు చేయబోతున్నారని సమాచారం.
నేటికీ సీపీఐ, సీపీఎం మద్దతును చంద్రబాబు పొందాడు. వామపక్షాలు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. బీజేపీతో పొత్తుకు మాత్రం అవి దూరంగా ఉంటాయి.
2024 ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి చంద్రబాబు ప్లాన్ ఏ లేదా ప్లాన్ బిని సిద్ధంగా ఉంచారని సమాచారం. ఇందుకోసం ప్రతిపక్షాలన్నింటిని ఏకం చేయాలని చూస్తున్నారు. అయితే చంద్రబాబు ఎన్ని ప్లాన్లు వేసినా ఓటర్లు జగన్ ను ఓడించకపోతే ఈ ప్లాన్లు అన్నీ వృథా కావడం ఖాయం.