
మొన్ననే టిడిపి ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై పెను వివాదం లేవదీసిన మెగా బ్రదర్ నాగబాబు తాజాగా టిడిపి ఇక మరెప్పటికీ అధికారంలోకి రాలేదని శాపం పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయే రోజులలో అధికారమలోకి వస్తే వైసిపి, జనసేన, బీజేపీ లకు అవకాశం ఉండవచ్చు గాని టిడిపికి మాత్రం ఉండబోదని స్పష్టం చేశారు. వీటిల్లో ఏ పార్టీ వస్తుందో కాలమే నిర్ణయిస్తుందని అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు.
వైసిపి ఒక సంవత్సరం పాలన వార్షికోత్సవం రోజున ఇచ్చిన ట్వీట్ లో ఆ పార్టీ పాలన గురించి గాని, ఆ పార్టీ అధినేత గురించి గాని ఒక్క మాట కూడా అనకపోవడం గమనార్హం. వైసిపి పాలన గురించి మాట్లాడని నాగబాబు టిడిపి హయాంలో మాత్రం ప్రజలకు ఏమీ చేయలేదని తేల్చి చెప్పారు. పైగా, వారి అభివృద్ధి అంతా టీవీల్లో, పేపర్లలోనే ఉందని అంటూ ఎద్దేవా చేశారు.
మళ్లీ అధికారం లోకి వస్తామనే భ్రమల నుంచి టీడీపీ వాళ్లు బయటపడాలని వారికి హితవు చెప్పారు. టీడీపీ వాళ్లు నిజాన్ని గుర్తించాలంటూ నాగబాబు చేసిన ట్వీట్స్ మీరే చూడండి
ఒక్కటి మాత్రం నిజం అధికారం లోకి వైసీపీ పార్టీ తరువాత వైసీపీ పార్టీ వస్తుందో jsp పార్టీ వస్తుందో,బీజేపీ పార్టీ వస్తుందో కాలమే నిర్ణయించాలి.కానీ టీడీపీ మాత్రం రాదని నా నమ్మకం.ఎందుకంటే టీడీపీ హయాం లో Ap ప్రజలకి ఊడబోడిచింది ఏమీలేదు.development అంతా టీవీల్లో పేపర్స్ లో తప్ప ..contd
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 30, 2020
నిజంగా చేసింది చాలా తక్కువ.అందుకే ఎలక్షన్స్ లో చాలా ఘోరంగా ఓడిపోయిందన్న విషయం టీడీపీ వారు గుర్తించాలి.ఇక నెక్స్ట్ మేమె వస్తాం మాదే రాజ్యం లాంటి illusions లోంచి బయటపడాలి. లేదు మేము ఇలాంటి కలలో జీవిస్తాం అంటే they ఆర్ welcome. కాకపోతే మానసిక శాస్త్రం లో అలాంటి పరిస్థితి ని ..contd
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 30, 2020
AP లో వైసీపీ పార్టీ తరవాత అధికారం లోకి వైసీపీ వస్తుందా,jsp వస్తుందా,బీజేపీ వస్తుందా అన్న విషయం కాలమే నిర్ణయించాలి.ఒక్కటి మాత్రం నిజం టీడీపీ రాదని నా గట్టి నమ్మకం.టీడీపీ ప్రభుత్వ హయాం లో ap ప్రజలకి ఊడబోడిచింది ఏమి లేదు.development అంత ఆనుకుల టీవీల్లోను,పత్రికల్లో నే కనబడేది.cont
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 30, 2020
గ్రౌండ్ లో కనిపించింది తక్కువ.ప్లస్ corruption,sand mafia,call money అబ్బో ఇంకా చాలవున్నాయి.ఈ ట్విట్టర్ ఎంసరిపోతోంది.లక్ష పేజీల గ్రంధాలే రాయొచ్చు.అందుకే ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోయింది అన్న విషయం టీడీపీ వాళ్ళు గుర్తించాలి.ఇక నెక్స్ట్ మేమె వస్తాం మాదే రాజ్యం లాంటి illusions..cont
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 30, 2020
Illusions లోంచి బయటకి రావాలి.లేదు మేము ఇలాంటి పగటి కలల్లో నే జీవిస్తాం అనుకొంటే they అర్ welcome.కానీ మానసిక శాస్త్రం లో అలాంటి వాటిని hallusinations అంటారు.అల్ ఠె బెస్ట్ ఫర్your hallusinations.
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 30, 2020