Nagababu: సినిమా వ్యవహారాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. టికెట్ల విషయంలో ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. సినిమా పెద్దలంతా కలిసి విన్నపాలు చేసినా పట్టించుకోలేదు. సీఎం జగన్ తాను అనుకున్నదే చేస్తారు. ఎంత మంది చెప్పినా వినిపించుకోరు. దీంతో అపఖ్యాతిని మూటగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత, నటుడు నాగబాబు స్పందించారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నాగబాబు ఎందుకు నోరు మెదుపుతున్నారో అర్థం కావడం లేదు.
గతంలో పవన్ కల్యాణ్ సినిమా వకీల్ సాబ్ విడుదలైనప్పుడు కూడా టికెట్ల రేట్లు తగ్గించడంతో ఎవరు కూడా స్పందించలేదు. దీంతో ఆయన ప్రభుత్వంపై తన అక్కసు వెళ్లగక్కారు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో వివాదం కాస్త వైరల్ గా మారినా ప్రభుత్వ నిర్లక్ష్యమే కనిపించింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సినిమా అయినా చిన్న సినిమాల విషయమైనా ఒకేలా ఉంటుందని ప్రభుత్వం తన పని తాను చేసుకుంటోంది.
Also Read: పెద్ద హీరోలు నోరు ఎత్తలేకపోయినా ప్రకాష్ రాజ్ తన గళమెత్తాడు !
ప్రస్తుతం విడుదలైన భీమ్లా నాయక్ విషయంలో కూడా ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం పవన్ కల్యాణ్ పై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని తెలుస్తోంది. ఇదే సందర్భంలో నాగబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఇన్నాళ్లు ఎవరు మాట్లాడటం లేదని నాగబాబు చెబుతుంటే మీరెందుకు మాట్లాడలేదనే వాదనలు కూడా వస్తున్నాయి.
ఈ క్రమంలో సినిమా రంగం స్థితి అధ్వానంగా మారింది. టికెట్ల ధరలు తగ్గించడంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. దీంతో ఏపీలో సినిమా పరిశ్రమను కోలుకోలేని విధంగా దెబ్బతీయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో వైసీపీ నిర్వాకంపై దుమ్మెత్తి పోస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనిపై సినిమా వాళ్లు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
Also Read: పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్రీట్.. భీమ్లానాయక్ అట్టర్ ఫ్లాప్ అట !