Pawan Kalyan Nagababu : ప్రపంచం లో తెలుగోడు ఏ మూలాన ఉన్నా పవన్ కళ్యాణ్ అనే పేరు వినిపిస్తే ప్రకంపనలు మొదలవుతాయి అంటూ ప్రముఖ గేయ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక ఫంక్షన్ లో చెప్తాడు..అది ముమ్మాటికీ నిజమే..ఆయనకి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది..సాధారణంగా ఇలాంటి క్రేజ్ ఉన్న ఏ హీరో అయినా తమ కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లి ఇండియాలోనే నెంబర్ 1 సూపర్ స్టార్ అయ్యే మార్గం లో నడుస్తారు.
కానీ పవన్ కళ్యాణ్ తనని ఇంతలా అభిమానించే వాళ్ళ కోసం ఎదో చెయ్యాలనే తపన తో,తన కెరీర్ ని సైతం రిస్క్ లో పెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు..మొదటిసారి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు గట్టి ఎదురు దెబ్బ తిన్నప్పటికీ ఏ మాత్రం వెనకడుగు వెయ్యకుండా ఆయన ప్రత్యర్థులతో పోరాడుతున్న తీరుకి ఎవరైనా సలాం చెయ్యాల్సిందే..అభిమానులు చూపిస్తున్న ఎనలేని ప్రేమకి ఆయన అన్నీ విధాలుగా అర్హుడు..లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ మీద గణ అనే రచయితా ‘ది రియల్ యోగి’ అనే పుస్తకం ని రచించాడు.
ఈ పుస్తకం లాంచ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో జరిగింది..ఈ కార్యక్రమానికి నాగబాబు, ఆనంద్ సాయి , మెహర్ రమేష్ ,డైరెక్టర్ బాబీ తదితరులు హాజరయ్యారు..ఈ ఈవెంట్ లో నాగబాబు మాట్లాడిన ఎమోషనల్ మాటలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది..ఆయన మాట్లాడుతూ ‘నా తమ్ముడి గురించి ఎక్కువగా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు..కానీ కొన్ని విషయాలు అందరికీ తెలియాలి..పవన్ కళ్యాణ్ ఎప్పుడు జనాల కోసం ఆలోచించే వ్యక్తి..తన భార్య బిడ్డలను కూడా వాళ్ళ కోసం కొన్నిసార్లు లెక్క చెయ్యని సందర్భాలు ఉన్నాయి’.
‘ఈ పార్టీ స్థాపించడానికి కళ్యాణ్ తన పిల్లల మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ ని బ్రేక్ చేసాడు..ఉన్న డబ్బుని మొత్తం ఈ పార్టీ కోసం కేటాయించాడు..ఈరోజు నా తమ్ముడు టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ స్టార్ హీరో..కానీ ఆర్థికంగా చూసుకుంటే నా తమ్ముడు పెద్ద జీరో’ అంటూ నాగబాబు చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.