Elon Musk- Twitter: సామాజిక మాధ్యమాల్లో ట్విటర్, ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లాంటి దిగ్గజాలు ఉన్నాయి. ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నాయి. దీంతో ట్విటర్ ఇటీవల ఎలన్ మస్క్ చేతికి వెళ్లడంతో ఆయన కీలక మార్పులుచేర్పులు చేస్తున్నారు. దీనికి ఉద్యోగులు ఆయన ఆదేశాలు పాటిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ట్విటర్ నిర్వహణ బాధ్యతలను తీసుకున్న మస్క్ భవిష్యత్ లో మరిన్ని మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రపంచంలో చాలా మంది ట్విటర్ ఖాతాను వాడుతున్నట్లు తెలిసిందే. వార్తలు, సినిమాలు, ప్రముఖుల సమాచారం కోసం ట్విటర్ ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా తోనే అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అందుకే వాటిని అనుసరిస్తున్నారు. ఇన్నాళ్లు ట్విటర్ సేవలు ఉచితంగానే పొందినా ఇకపై చార్జీలు చెల్లించాల్సిందేనని తెలుస్తోంది. దీని కోసం మస్క్ కొన్ని మార్పులు సూచించినట్లు సమాచారం.
Also Read: CM Jagan- Ali: కమెడియన్ అలీకి షాకిచ్చిన జగన్
వాణిజ్య వినియోగదారులు, ప్రభుత్వ సంస్థలు ట్విటర్ వినియోగించినందుకు ఫీజు చెల్లించాల్సిందే. ఈ మేరకు సీఈవో ఎలన్ మస్క్ సూచనలు చేస్తున్నారు. ఇది స్వల్ప మొత్తంలోనే ఉంటుందని తెలుస్తోంది. సాధారణ వినియోగదారులు మాత్రం రూపాయిచెల్లించనక్కరలేదని చెబుతున్నారు. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సంస్థలు మాత్రం చార్జీ చెల్లించి సేవలు పొందవచ్చని చెబుతున్నారు.
ఎలన్ మస్క్ రూ.44 బిలియన్ డాలర్లు ఇండియా కరెన్సీలో సుమారు రూ. 3.30 లక్షల కోట్లు చెల్లించి ట్విటర్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ట్విటర్ ను భవిష్యత్ లో మరింత మార్పులు చేసి వినూత్నంగా తయారు చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్లు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ట్విటర్ ఖాతా నిర్వహణకు ఇంకా ఏమేం నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళతారో తెలియడం లేదు.
Also Read:CM KCR- CS Somesh Kumars: సీఎస్ సోమేష్ కు కేసీఆర్ మంగళం పాడుతున్నారా?