
ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీ మోహన్ తాజాగా చేసిన కామెంట్స్ రాజకీయ, సినీ రంగాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీలో హయాంలో ఎంపీగా పనిచేసిన మురళీ మోహన్ కిందటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన ఎవరూ కూడా నమ్మట్లేదని అంటున్నారు. తాను పదేళ్లపాటు రాజకీయాల్లో కొనసాగడం వల్ల చాలా కోల్పోయానని.. రాజకీయాలంటేనే విరక్తి పుట్టిందంటూ హాట్ కామెంట్ చేశారు.
Also Read: వెక్కిరిస్తున్న ఏపీ ఖజానా.. జగన్ ఏం చేయనున్నాడు?
చంద్రబాబు తనపై ఒత్తిడి చేయడం వల్లే రాజకీయాల్లోకి వచ్చినట్లు మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. 2009లో టీడీపీ నుంచి రాజమండ్రి ఎంపీగా మురళీ మోహన్ పోటీచేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో తిరిగి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఇక 2019ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పటికే ప్రజలను తనను పొలిటిషియన్ గానే చూస్తున్నారని చెప్పుకొచ్చారు.
తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాల్లో నటిస్తానని చెప్పినా ఎవరూ నమ్మడం లేదని ఆయన కామెంట్ చేశారు. దర్శక, నిర్మాతలు కూడా తనకు వద్దకు వచ్చే ప్రయత్నం చేయడం లేదన్నారు. తాను సినిమా పరిశ్రమను వదిలి పదేళ్లు రాజకీయాల్లో ఉండి సాధించింది ఏమిలేదన్నారు. పదేళ్ల కాలంలో చాలా కోల్పోయినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి వెళ్లా పెద్ద తప్పు చేశానంటూ బాధపడుతున్నారు.
తాను రాజకీయాల్లోకి డబ్బు సంపాదించేందుకు రాలేదని స్పష్టం చేశారు. తనకు డబ్బు కావాలంటే సినిమా పరిశ్రమ ఉందని.. వ్యాపారాలు.. రియల్ ఎస్టేట్ ఉందని తెలిపారు. ప్రజల కోసం ఎంత చేసినా ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయని తెలిపారు. ఇక ప్రతిపక్షంలో ఉంటే లేనిపోని ఆరోపణలు చేస్తుంటారని తెలిపారు. తాను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటే తిన్నదంతా కక్కి అప్పుడు వెళ్లాడంటూ విమర్శలు చేస్తున్నారని వాపోయారు.
Also Read: బీజేపీలో చేరికలపై వీర్రాజు ‘లెక్కే’ వేరప్పా..!
రాజకీయాల్లో తన సొంత డబ్బులే ప్రజల కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు వెంట తిరిగిన మురళీ మోహన్ ప్రస్తుతం ఆయన వాళ్లే జీవితంలో చాలా కోల్పోయానని ఆరోపించడం ప్రస్తుతం రాజకీయ, సినీ రంగాల్లో చర్చనీయాంశంగా మారింది. మురళీ మోహన్ కామెంట్లపై బాబు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!