Munugodu By-Poll : మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్‌లో నువ్వా నేనా అన్నట్లుగా టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ కొనసాగుతోంది. ఉదయం 10:45 గంటల వరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. ఇందులో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిపై 6 ఓట్ల మెజారిటీ సాధించారు. బీఎస్పీకి 6 ఓట్లు పోలయ్యాయి. ఇక మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 1,290 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక్కడ రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో కాంగ్రెస్ నిలిచాయి.
-2, 3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యం..
రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు. మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్ సాధించిన ఆధిక్యాన్ని మించి రెండో రౌండ్‌లో ఓట్లు సాధించారు రాజగోపాల్‌రెడ్డి దీంతో 33 ఓట్ల స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. మూడో రౌండ్ కౌంటింగ్‌లోనూ బీజేపీ ఆధిక్యం కొనసాగింది. ఈ రౌండ్ తర్వాత బీజేపీ ఆధిక్యం 300 దాటింది.
-4వ రౌండ్‌లో మళ్లీ టీఆర్‌ఎస్..
ఇక నాలుగో రౌండ్‌లో బీజేపీని టీఆర్‌ఎస్ మళ్లీ దాటేసింది. ఇక్కడ బీజేపీ లీడ్ 300 దాటి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 714 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. దీంతో టీఆర్‌ఎస్ శిబిరంలో మళ్లీ ఆశలు చిగురించాయి.
-కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రాజగోపాల్‌రెడ్డి, స్రవంతి..
నాలుగో రౌండ్ ఫలితాలను ఈసీ వెల్లడించిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ భ్యర్థులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థికి నాలుగు రౌండ్లలో కలిపి కేవలం 7,380 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆశించిన ఫలితం కనిపించకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థి కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఇక బీజేపీ అభ్యర్థి టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు. అయినా ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి కూడా కేంద్రం నుంచి బయటకు వచ్చారు. కౌంటింగ్‌లో అభ్యంతరాలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు రాజగోపాల్‌రెడ్డి కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అయితే చౌటుప్పలలో ఆశించిన ఓట్లు మాత్రం రాలేదని తెలిపారు. ఈ కారణంగానే ఆయన బయటకు వెళ్లిపోయారా లేక తదుపరి రౌండ్లలో ఫలితాలు తేడా ఉంటాయని ముందే ఊహించి వెళ్లిపోయారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.