Homeజాతీయ వార్తలుMumbai School Jihad Controversy: ముంబైలో ’స్కూల్‌ జిహాద్‌’.. భూ మాఫియా పని పట్టేందుకు చర్యలు!

Mumbai School Jihad Controversy: ముంబైలో ’స్కూల్‌ జిహాద్‌’.. భూ మాఫియా పని పట్టేందుకు చర్యలు!

Mumbai School Jihad Controversy: ముంబై.. దేశ ఆర్థిక రాజధాని. దేశంలో అత్యంత ఖరీదైన మున్సిపల్‌ కార్పొరేషన్‌. ఇక్కడ స్లమ్‌ ఏరియాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ స్లంల వెనుక పెద్ద భూ మాఫియా ఉందని బీజేపీ సీనియర్‌ నాయకుడు కిరిట్‌ సోమయా బయటపెట్టారు. ముంబైలో 164 అక్రమ స్కూళ్లను ‘స్కూల్‌ జిహాద్‌’గా పేర్కొన్నాడు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి బడి కట్టి.. ఆకుపచ్చ జెండాలు ఎగరేసి.. మసీదులు నిర్మించి కాలనీలుగా మార్చబడతాయని ఆరోపణ. బృహద్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ స్కూళ్ల జాబితాను వెల్లడించింది, ఇందులో 150కి పైగా ముస్లిం భూమాఫియాల చేత నడుస్తున్నాయని సోమయా చెప్పాడు.

భూమి కబ్జా విధానం
స్కూళ్లు కట్టి బోర్డులు పెట్టి, క్రమంగా మసీదులు ఎదుర్కొని భూమిని ఆక్రమించడం 15–20 సంవత్సరాలుగా జరుగుతోందని సోమయా వాదన. మున్సిపల్‌ అధికారులు చూసి చూడకపోవడం వెనుక అవినీతి ఉందని ఆరోపణ. ఇలా ఏర్పడిన కాలనీల్లో బంగ్లాదేశ్‌ చొరబాటుదారులు స్థిరపడి, సెక్యులరిజం పేరుతో ఓట్లు సేకరిస్తారని ఆయన చెప్పాడు.

అక్రమ వలసలు, ఫేక్‌ డాక్యుమెంట్లు..
మహారాష్ట్రలో అత్యధిక ఫేక్‌ ఆధార్‌ కార్డులు ఉండటం బంగ్లాదేశ్‌ చొరబాటుదారుల కోసమేనని సోమయా ఆరోపించాడు. నకిలీ పత్రాలతో వారిని స్థిరపరచి ఓటు హక్కు కల్పిస్తున్నారని వాదన. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు (నేపాల్, బంగ్లాదేశ్‌ వలసలకు ఫేక్‌ డాక్యుమెంట్లు) నివేదికల్లో కనిపిస్తున్నాయి.

ఈ ఆరోపణలు భూమాఫియా, అవినీతి, అక్రమ వలసలపై దృష్టి సారిస్తున్నాయి, కానీ ’జిహాద్‌’ పదం మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించవచ్చు. ముంబై వంటి ధనిక మున్సిపాలిటీల్లో ఫ్యాక్టరీల మూతలు, మత కల్లోలాల వెనుక భూమి మాఫియా ఉండటం చరిత్రలో కనిపిస్తుంది. ప్రభుత్వం భూప్రక్షాళనకు, చొరబాట్లపై దృష్టి పెట్టాలని ముంబై వాసులు కోరుతున్నారు. ఈమేరకు ప్రభుత్వం కూడా ప్రక్షాళన చర్యలు చేపట్టింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular