Mukhesh Ambani : ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ. ప్రపంచంలోని అగ్రగామి వ్యాపారవేత్తగా పేర్గాంచిన రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ లగ్జరీ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన 12వేల కోట్ల రూపాయలతో యాంటిలెనా ఇళ్లను ముంబైలో కట్టించిన విషయం తెలిసిందే. అలాగే తన చిన్న కొడుకు పెళ్లికి రూ.5వేల కోట్లు ఖర్చు చేయడాన్ని బట్టి వారెంత లగ్జరీగా జీవిస్తుంటారో అర్థం అవుతుంది. అలాగే వారు రోజు వారి ప్రయాణించే కార్లు కూడా చాలా లగ్జరీగా ఉంటాయి. కార్లంటే అమితమైన ఇష్టం ఉన్న అంబానీ గ్యారేజీలో కొత్త కారు వచ్చి చేరింది. ఆయన తాజాగా కొనుగోలు చేసిన కారు ఇప్పటి వరకు భారతదేశంలో ఎవరికి కూడా లేదు. అది అత్యంత ప్రతిష్టాత్మకమైన రోల్స్ రాయిస్ కలిషన్ బుల్లెట్ ప్రూఫ్ కారు. ఈ కారు అత్యంత పవర్ ఫుల్ కారుగా చెబుతున్నారు. ఇది బాంబు దాడులను సమర్ధవంతంగా తట్టుకోగలుగుతుంది. బాంబు దాడుల సమయంలోనూ లోపల ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా ఉండగలుగుతారు.
ఈ కారులో ప్రయాణం చేస్తుంటే ఎలాంటి ఆపదలు వచ్చినా ప్రయాణికులు పూర్తి సురక్షితంగా ఉంటారు. ఈ కారును చాలా ప్రత్యేకంగా రూపొందించినట్లు సమాచారం. బుల్లెట్ ప్రూఫ్ కారు కావడం వల్ల, తుపాకీ గుళ్ల ద్వారా ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొంటుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం చేయవచ్చు.
కారు ఖరీదు
అంబానీ కొనుగోలు చేసిన ఈ రోల్స్ రాయిస్ కలిషన్ బుల్లెట్ ప్రూఫ్ కారు విలువ దాదాపు రూ.8 కోట్లు. కానీ, ఈ కారులో ప్రత్యేకమైన మార్పులు, అదనపు ఫీచర్లు జోడించడం వల్ల కారు మొత్తం విలువ రూ.13 కోట్ల వరకు పెరిగింది. ఈ ధరకు తగ్గట్లే కారు అన్ని ప్రమాణాలను తీసుకుని, అత్యధిక భద్రతను అందించడానికి ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగించి రూపొందించారు.
అంబానీ గ్యారేజీ
ముఖేష్ అంబానీకి కార్లంటే అమితమైన ఇష్టం. ఇప్పటికే ఆయన గ్యారేజీలో వందల కొద్ది కార్లు ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో ఖరీదైన కార్లు, ప్రత్యేకమైన మోడల్స్ ఉన్నాయి. గతంలో ఆయన గ్యారేజీలో బెంట్లే, ల్యాంబోర్ఘిని, బుగాట్టి వంటి ప్రఖ్యాత బ్రాండ్ల కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త రోల్స్ రాయిస్ కారు తన గ్యారేజీ లో వచ్చి చేరింది.
కారు ప్రత్యేకతలు
ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు ప్రత్యేకమైన పవర్ కలిగి ఉంటుంది. దీనిలో ఉపయోగించిన మాసివ్ మెటల్ ప్లేట్స్, పేలుడు, బుల్లెట్ దాడులకు రక్షణ అందించే సాంకేతికతలు, అదనపు భద్రతా సదుపాయాలు ప్రయాణాన్ని మరింత సురక్షితం చేస్తాయి. అంతేకాకుండా, కారు ఇంత ఖరీదైనది కావడం వల్ల, ప్రపంచంలో అత్యంత లగ్జరీ కార్లలో ఒకటిగా పరిగణిస్తున్నారు.