Mudragada Padbanabham: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని తీవ్రస్థాయిలో ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం చాలా రోజుల తరువాత వార్తల్లో కనిపించారు. గత ప్రభుత్వ హయాంలో కాపు ఉద్యమం ఉవ్వెత్తున సాగేలా చేసిన ముద్రగడ.. జగన్ ప్రభుత్వం లోకి రాగానే కనిపించకుండా పోయారు. మళ్లీ ఇప్పుడు ఆయన మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న వ్యవహారంపై అందరితోపాటు ముద్రగడ తన అభిప్రాయాన్ని చెప్పాడు. అయితే బాబుకు వ్యతిరేకంగా కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ‘తాను చేసిన పాపం తనకే చుట్టింది..’ అంటూ బాబును ఉద్దేశించి అనడంతో ఆయన ఇప్పటికీ ఆయనపై కోపంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: చంద్రబాబు పరువు ఎవరు తీస్తున్నారు..?
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు బోరున విలపించారు. ఇక తాను సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడుతానని శపథం చేసి సమావేశాలను బహిష్కరించారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. చంద్రబాబు కన్నీళ్లపై ఆయన కుటుంబ సభ్యులు వైసీపీ నాయకులపై ఆక్రోశం వ్యక్తం చేయగా.. వైసీపీ మద్దతుదారులు మాత్రం అదంతా డ్రామా.. అంటూ కొట్టిపారేశారు. అయితే రాజకీయంతో సంబంధంలేని కొందరు బాబుకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు.
ఈ క్రమంలో గత ప్రభుత్వంలో కాపు ఉద్యమం నడిపించిన ముద్రగడ పద్మనాభం మాత్రం బాబుకు వ్యతిరేకంగా కామెంట్ చేశాడు. బాబుకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2019లో వైసీసీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కువగా కనిపించని ముద్రగడ తాజాగా బాబుపై కామెంట్ తో మళ్లీ వెలుగులోకి వచ్చారు. అయితే ముద్రగడ మరోసారి ఉద్యమ రంగంలోకి దిగనున్నాడా..? అన్న చర్చ సాగుతోంది. అయితే ఈ ఉద్యమం వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను విఫలం చేయడానికేనని అంటున్నారు. గత కొంతకాలంగా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి కమ్మ, కాపులను ఏకం చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. రెండు కులాలు ఒక్కటైతే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయం అని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే జనసేన పరోక్షంగా టీడీపీకి మద్దతు ఇస్తూ వస్తోందని అంటున్నారు.
ఈ తరుణంలో మరోసారి ముద్రగడ పద్మనాభం కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజికవర్గాలన్నీ ఏకం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో చంద్రబాబు, పవన్ చేస్తున్న ప్రయత్నాలకు ముద్రగడ అడ్డుకట్ట వేస్తున్నారా…? అన్న చర్చ సాగుతోంది. తనకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అవమానంపై ఆయన ఇంకా రగులుతూనే ఉన్నట్లు కనిపిస్తోంది. తనను, తన కుటుంబ సభ్యులపై పోలీసుల ప్రవర్తనపై ఆయన మర్చిపోనట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ పరాభవానికి ముద్రగడ కూడా కారణమని చెప్పుకుంటారు. అయితే మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న బాబు ప్రయత్నాలను మరోసారి బెడసి కొట్టేలా ముద్రగడ వ్యూహం పన్నుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ముద్రగడ బాబు కన్నీళ్లపై వ్యతిరేకంగా కామెంట్ చేశారని అనుకుంటున్నారు.
Also Read: మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్య విరమించా.. చంద్రబాబు కన్నీళ్లపై ముద్రగడ పాత పగల కథేంటి?