Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy: పరువుపోతుందనే సైడ్ చేశారా? విజయసాయిరెడ్డి విషయంలో ఏం జరిగిందంటే?

Vijayasai Reddy: పరువుపోతుందనే సైడ్ చేశారా? విజయసాయిరెడ్డి విషయంలో ఏం జరిగిందంటే?

Vijayasai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డి బయటకు జెంటిల్మన్ గా కనిపిస్తారు కానీ.. ఆయన వ్యవహార శైలి మాత్రం భిన్నంగా ఉంటుంది. వాడే భాష కఠువుగా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఆయన రాజకీయ ప్రత్యర్థులపై చేసే కామెంట్స్ దారుణంగా ఉంటాయి. సహచర నేతలని చూడకుండా.. వారి కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టింగులు పెట్టడానికి వెనుకాడరు. తాను ఎంతలా దిగజారిపోతున్నానోనని బహుశా విజయసాయిరెడ్డికి తెలిసినట్టు లేదు.కానీ ఇప్పుడు మాత్రం గుణపాఠం కలిగే పరిస్థితులు ఎదురయ్యాయి. నిండు సభలో రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ల జాబితా నుంచి విజయసాయిరెడ్డిని తొలగిస్తున్నట్టు సాక్షాత్ ఉప రాష్ట్రపతి దన్ ఖడ్ ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావన తేకుండా ప్యానల్ వైస్ చైర్మన్ల భర్తీని పునర్వ్యవస్థీకరణ పేరుతో తొలగించడం మాత్రం నిజంగా అవమానకరమే. రెండు రోజుల ముందు ప్రకటించిన ఎనిమిది మందిలో విజయసాయిరెడ్డి ఉండగా… పునర్వ్యవస్థీకరించి మరీ విజయసాయిరెడ్డి పేరు తొలగింపు వెనుక ‘ఆయన‘ దిగజారుడుపై ఫిర్యాదులు వెల్లువెత్తడమే కారణం.

Vijayasai Reddy
Vijayasai Reddy

చివరి క్షణంలో విజయసాయిరెడ్డి పేరు తొలగింపు వెనుక పెద్ద ఎపిసోడే నడిచింది. ఆయన ఎలాంటి వ్యక్తో.. ఎలా ప్రవర్తిస్తారో తెలియంది కాదు. కానీ రాజకీయ లెక్కలతో ఆయనకు ప్యానల్ వైస్ చైర్మన్ పదవి కేటాయించారు. ఎనిమిది మందితో కూడిన జాబితాను రాజ్యసభ కార్యాలయ వర్గం ప్రకటించింది. దీంతో తెగ మురిసిపోయిన విజయసాయి ట్విట్టర్ ద్వారా ఉపరాష్ట్రపతి దన్ ఖడ్ కు థాంక్స్ కూడా చెప్పారు. అయితే ఇంతలో విజయసాయిరెడ్డిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఆయన రాజకీయ ప్రత్యర్థులపై చేసే కామెంట్స్, పెట్టే పోస్టింగులతో సహా ఫిర్యాదు కాపీలను జతచేసి కొందరు ఉపరాష్ట్రపతికి ఫిర్యాదుచేశారు. ఎటువంటి గౌరవ మర్యాదలను పాటించని అటు వ్యక్తిని వైస్ చైర్మన్ సీట్లో కూర్చొబెడితే ఆ పదవికే మాయని మచ్చగా మిగులుతుందని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి తెలుగులో పెట్టిన కామెంట్లను ఇంగ్లీష్ లో ట్రాన్స్ లేట్ చేసి మరీ ఫిర్యాదుచేయడంతో ఉప రాష్ట్రపతి పునర్వ్యవస్థీకరణ పేరుతో విజయసాయిరెడ్డి పేరును సైడ్ చేశారు.

Vijayasai Reddy
Vijayasai Reddy

అయితే విజయసాయిరెడ్డి వ్యక్తిత్వంపై ఫిర్యాదుల ద్వారా తెలుసుకున్న ఉప రాష్ట్రపతి ఆశ్చర్యపోయారుట. ఇలాంటి మనిషా అంటూ అసహనం వ్యక్తం చేస్తూ కనీస సమాచారం ఇవ్వకుండా పేరును తప్పించారని ఢిల్లీపొలిటికల్ సర్కిల్ లో ఒక వార్త మాత్రం సర్క్యూలేట్ అవుతోంది. పేరు ప్రకటించినట్టే ప్రకటించి వెనక్కి తీసుకోవడం అవమానకరమే, ప్యానల్ వైస్ చైర్మన్లుగా డీఎంకే, బీజేడీ, టీఎంసీలకు ప్రాతినిధ్యం దక్కింది. అందులో వైసీపీకి చోటు కల్పించారు. కానీ గోల్డెన్ చాన్స్ విజయసాయిరెడ్డి వ్యవహార శైలితో దక్కకుండా పోయిందని వైసీపీలో కూడా చర్చ నడుస్తోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీల హక్కులను హరిస్తున్నారని విజయసాయిరెడ్డిపై ఒక అపవాదు ఉంది. కానీ ఆయన వ్యవహార శైలి పుణ్యమా అని వైసీపీ ఢిల్లీ సర్కిల్ లో డ్యామేజ్ అవుతుందన్న చర్చ కూడా పార్టీలో నడుస్తోంది. చాలామంది ఎంపీలు ఆయనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ జగన్ ను దృష్టిలో పెట్టుకొని వెనక్కితగ్గతున్నారు. అయితే ఈ ఎపిసోడ్ లో మాత్రం ఢిల్లీ పెద్దలకు ఒక పిక్చర్ వచ్చింది. విజయసాయిరెడ్డిది మరీ ఇంత దిగజారుడు క్యారెక్టరా అని. అటువంటి వ్యక్తిని ప్యానల్ వైస్ చైర్మన్ గా అవకాశమిస్తే కేంద్రం పరువు పోతుందన్న భయంతోనే పేరు ప్రకటించి మరీ పక్కన పడేశారన్నటాక్ అయితే ఉంది. ఇప్పటికైనా విజయసాయి తన పంథాను మార్చుకుంటారా? లేకుంటే అదే దూకుడుతో మున్ముందు కష్టాలు రెట్టింపు చేసుకుంటారో చూడాలి మరీ.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version